
నేషనల్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యే దశలో ఉంది. ముఖ్యంగా హీరోలకు సంబంధించిన పార్ట్ మొత్తం ఇప్పటికే పూర్తయింది. అందుకే హీరోలు ఇద్దరూ తమ కొత్త సినిమాల వైపు ఆలోచనలు షురూ చేశారు. ఎన్టీఆర్ తన 30వ చిత్రం షూటింగ్ కి డేట్ కూడా ఫిక్స్ చేసాడట. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారు. రెగ్యులర్ షూటింగ్ మే 16 నుండి గానీ, జూన్ ఫస్ట్ వీక్ నుండి కానీ మొదలవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కోసం తారక్ నెలలో సగం రోజులు మాత్రమే తన డేట్స్ ను ఇస్తాడట.
Also Read: నటి పవిత్ర లుక్స్ అదిరిపోలా?
ఎదుకంటే త్రివిక్రమ్ సినిమాతో పాటు ఎన్టీఆర్ “మీలో ఎవరు కోటీశ్వరులు” అనే టీవీ షోను కూడా ఒకే టైంలో చేస్తున్నాడు. అందుకే ప్రతివారం రెండు రోజులు టీవీ షో కోసం డేట్స్ కేటాయిస్తే.. మిగిలిన నాలుగు రోజులు పాటు సినిమాకి డేట్స్ ను కేటాయించేలా తారక్ తన మేనేజర్ కి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్టీఆర్ రెండున్నర నెలల పాటు సాగే ఈ షోతో పాటు త్రివిక్రమ్ సినిమాతో కూడా ఫుల్ బిజీగా ఉంటాడు. మొత్తానికి అటు ఇటు రెండింటిని బ్యాలన్స్ చేస్తున్నాడు. అన్నట్టు “మీలో ఎవరు కోటీశ్వరులు” షోకి ఎన్టీఆర్ కి దాదాపు 12 కోట్ల పారితోషికం తీసుకున్నాడని సమాచారం.
Also Read: అవసరాల శ్రీనివాస్ వైరల్ వీడియో వెనుక కథ ఇదా?
మెగాస్టార్ చిరంజీవి ఈ షో కోసం పది కోట్లు పుచ్చుకున్నారు. చిరు కంటే తారక్ రెండు కోట్లు ఎక్కువ తీసుకున్నాడు అన్నమాట. ఇక ఈ షో పూర్తికాగానే, ఎన్టీఆర్ అటు “ఆర్ఆర్ఆర్” ప్రొమోషనల్ వీడియోస్ లో పాల్గొంటాడు. “ఆర్ ఆర్ ఆర్” సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ లోపు ప్రమోషన్స్ కోసం రాజమౌళి హీరోల చేత డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలను ప్లాన్ చేస్తున్నాడట. ఓవరాల్ గా ఎన్టీఆర్ ఈ ఏడాది మల్టీటాస్కింగ్ తో హడావుడిగా గడపనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్