Junior Ntr Political Entry: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ తరఫున కాబోయే సీఎం ఎన్టీఆరే అని.. ఇలా తారక్ అభిమానులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబుకు వయసు అయిపోతుండటం, దీనికితోడు తారక్ లో మంచి రాజకీయ నాయకుడు ఉండటం.. మొత్తానికి కొందరు టీడీపీ నాయకులకు ఇది నినాదం అయ్యింది.

మరి నిజంగానే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతాడా ? మెగాస్టారే సక్సెస్ కాలేదు, ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ రాజకీయం చేయగలడా ? వచ్చే ఏపీ ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ఉంటుందని ఓ వాదన బాగా వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా రాజకీయాల పై ఏం మాట్లాడినా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడతున్నాడు.
Also Read: ‘మహేష్ – రాజమౌళి’ సినిమాలో హీరోయిన్, విలన్ ఫిక్స్
ఎంతైనా, ఎవరితో ఎలా ఉండాలి ? ఎవర్ని ఎలా డీల్ చేయాలి ? లాంటి అంశాల్లో ఎన్టీఆర్ కి మంచి అనుభవం ఉంది. చిన్న వయసులోనే రాజకీయ దెబ్బలు తిన్న కష్టాల గమనం ఉంది. అందుకే, ఎన్టీఆర్ పక్కా ముందు చూపుతో ముందుకు వెళ్తున్నాడని అంటున్నారు. మరోపక్క తారక్ సన్నిహితులు మాత్రం ‘వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో డైరెక్ట్ గా తన పాత్ర లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.
అదే విధంగా వచ్చే ఎన్నికల నాటికీ పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోవాలని కూడా తారక్ ప్లాన్ చేసుకున్నాడు. రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమా కూడా మల్టీస్టారర్ అంటున్నారు. ఆ సినిమాలో తారక్ నటించబోతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. పైగా ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగానే ప్లాన్ చేస్తున్నాడు.

కొరటాల సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం ఉంటుంది. ఆ తర్వాత దర్శకుడు అట్లీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. రాజకీయాలు కంటే పాన్ ఇండియా స్టార్ అవడమే ముఖ్యం అని తారక్ ఫీల్ అవుతున్నాడు. అయితే, 2029 నాటికీ ఫుల్ టైం పొలిటీషియన్ గా తారక్ మారతాడట. అంటే.. పాన్ ఇండియా స్టార్ తర్వాత పొలిటీషియన్ అవుతాడట.
Also Read: చిరంజీవికి నిజంగానే నచ్చిందా ? లేక కాంప్రమైజ్ అయ్యాడా ?