Homeఎంటర్టైన్మెంట్NTR drops 1000 crore project: #RRR తర్వాత 1000 కోట్ల ప్రాజెక్ట్ వదులుకొని 'వార్...

NTR drops 1000 crore project: #RRR తర్వాత 1000 కోట్ల ప్రాజెక్ట్ వదులుకొని ‘వార్ 2’ చేసిన ఎన్టీఆర్.. బ్యాడ్ లక్ అంటే ఇదే..

NTR drops 1000 crore project: ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చేయడం , అది హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం వంటివి జరగడం మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు. దశాబ్దాల నుండి జరుగుతూనే ఉంది. కొందరు ఇలా సూపర్ స్టార్స్ అయ్యారు, మరికొందరు ఫేడ్ అవుట్ అయ్యారు. అయితే #RRR వంటి భారీ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) కూడా ఇలాంటి పొరపాటే చేశాడు. ‘దేవర’ చిత్రం తో పాటు ఆయన బుచ్చి బాబు తో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు. కానీ ‘వార్ 2’ డేట్స్ కి క్లాష్ రావడంతో , బుచ్చి బాబు సినిమాని వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ బుచ్చి బాబు సినిమానే ‘పెద్ది’. ఈ చిత్రం పై టాలీవుడ్ లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా వైరల్ అయిపోతుంది.

ఈమధ్య కాలం లో ఏ పెద్ద హీరో సినిమాకు కూడా ఇలా జరగలేదు. నిన్న విడుదలైన టీజర్ కి కూడా ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ఈ టీజర్ లో రామ్ చరణ్ ని చూస్తున్నంత సేపు ఆంజనేయ స్వామి నే కనిపించాడు. ఇంకా ఇలాంటి స్టఫ్ మూవీలో ఏ రేంజ్ లో ఉండుంటుందో మీరే ఊహించుకోండి. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. కనీసం యావరేజ్ అయినా కూడా 600 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే స్టామినా ఉంది ఈ చిత్రానికి. అలాంటి స్టామినా ఉన్న సినిమాని ఎన్టీఆర్ వదిలేసుకోవడం తో అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఒకవేళ సినిమా విడుదలై అంచనాలను అందుకుంటే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా బాధపడాల్సి ఉంటుంది.

Also Read: మహేష్ బాబు తో సినిమా చేయడం అంత ఈజీ కాదంటున్న స్టార్ డైరెక్టర్…

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ‘పెద్ది’ చిత్రానికి ఉన్నంత లాంగ్ రన్ కెపాసిటీ , ప్రశాంత్ నీల్ మూవీ కి ఉండదు. కేజీఎఫ్ సిరీస్ లాంటి సంచలనం తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేసిన ‘సలార్’ చిత్రానికి ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి కానీ, లాంగ్ రన్ అనుకున్నంత రేంజ్ లో రాలేదు. డ్రాగన్ కి కూడా అదే రిపీట్ అవ్వొచ్చు అంటూ విశ్లేషకులు అంటున్నారు. మరి ఏమి జరగబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular