Rajamouli-Mohan Babu: తెలుగు సినిమా స్థాయిని ఒక్కసారిగా జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఈయన చేసిన ఒక్కో సినిమా ఒక్కో అద్భుతమనే చెప్పాలి. రాజమౌళితో(Rajamouli) సినిమా చేయడానికి ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ పోటీపడుతున్నారు. అయితే రాజమౌళి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను గుర్తించి మరీ తన సినిమాలో పెట్టుకుంటూ ఉంటాడు. ఇక యమదొంగ సినిమా సమయం లో యముడిగా మోహన్ బాబుని తీసుకున్న రాజమౌళి ఆ తర్వాత నుంచి మళ్లీ మోహన్ బాబుని ఎందుకు రిపీట్ చేయడం లేదు అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
అయితే మోహన్ బాబు(Mohan Babu) కూడా మంచి ఆర్టిస్టే అయిన కూడా రాజమౌళి ఆయన్ని ఎందుకు రిపీట్ చేయడం లేదు అనే విషయం మీద కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుస్తున్నాయి. అదేంటి అంటే యమదొంగ సినిమా షూటింగ్ టైమ్ లో మోహన్ బాబు ఎప్పుడు రాజమౌళితో తన కొడుకు అయిన విష్ణు తో ఎప్పుడు సినిమా చేస్తావు అని అందరి ముందే అడిగేవాడట. దానికి రాజమౌళి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ, నవ్వుతూ చేస్తాను అని ఎంత చెప్పిన కూడా మోహన్ బాబు వినిపించుకోకుండా కరెక్ట్ గా ఒక డేట్ చెప్పు అని రాజమౌళి ని అడిగేవాడట. దానికి రాజమౌళి అటు షూటింగ్ పనుల్లో బిజీగా ఉండడం ఒకటైతే, ఇటు మోహన్ బాబు పెట్టే ఇబ్బంది కూడా ఆయనకి టార్చర్ గా అనిపించేదట.
ఇక దానివల్ల తను కొన్నిసార్లు సెట్ లోనే కొంతమంది మీద చిరాకు పడేవాడట. ఇక అప్పుడే రాజమౌళి మోహన్ బాబు ను ఇంకొక సినిమాలో రిపీట్ చేయకూడదని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. ఇక రాజమౌళి విష్ణు సినిమా మీద క్లారిటీ ఇవ్వకపోవడం తో మోహన్ బాబు కూడా రాజమౌళి మీద కొంచెం సీరియస్ గా ఉండేవాడట. ఇక దానివల్లే రాజమౌళి మళ్లీ మోహన్ బాబు ని రిపీట్ చేయడం లేదంటూ రాజమౌళి అభిమానులు, అలాగే రాజమౌళి గురించి తెలిసిన సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు…ఇక ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది…