బబ్లీ గర్ల్ ‘రాశీ ఖన్నా’ మొదట మనం సినిమాలో చిన్న సైడ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అమ్మడుకు పెద్దగా టాలెంట్ లేకపోయినా హిట్లు లేకపోయినా చూస్తుండగానే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించేసుకుంది. సడెన్ గా ఛాన్స్ లు పోటెత్తడంతో రెమ్యునిరేషన్ ను భారీగా డిమాండ్ చేసింది. అలా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మేకర్స్ భారీగానే ముట్టజెప్పి, ఆమెకు ఎక్స్ పోజింగ్ విషయంలో పరిథి దాటాలనే కండిషన్ పెట్టారు. రెండు సినిమాల డబ్బులు ఒకేసారి వచ్చి పడేసరికి సెమీ న్యూడ్ కి కూడా సై అనేసింది.
నిజానికి కెరీర్ స్టార్టింగ్ నుండి అందాలు ఆరబోయడంలో హద్దులు దాటని రాశీ ఖన్నా, వరల్డ్ ఫేమస్ లవర్ కోసం ఏకంగా రొమాంటిక్ సీన్స్ లో విజయ్ దేవరకొండకు పోటీ పడి మరీ నటించడం, కొన్ని బెడ్ సీన్స్‌లో అయితే దేవరకొండను సైతం డామినేట్ చేస్తూ రెచ్చిపోవడంతో రాశీ ఖన్నా ఆ మధ్య టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిపొయింది. అసలు ఆ సినిమా ట్రైలర్ లోనే రాశీఖన్నా బాతింగ్ షాట్ సంచలనం రేపింది. ఆ సీన్ లో ఒక ఎమెషన్ ఉందని, అందుకే తగ్గట్టే ఆ సినిమాలో నటించానని.. ఎంత కవర్ చేసినా, రాశీ కెరీర్ కి ఆ సినిమా బాగా ఎఫెక్ట్ అయింది. పైగా ఆ సినిమా పెద్ద అట్టర్ ప్లాప్ అయ్యే.
ఇప్పుడు కాస్త స్టార్ డమ్ ఉన్న హీరోలు రాశీకి ఛాన్స్ లు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని టాక్. మొదట చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నితిన్ సరసన రాశీనే హీరోయిన్ గా అనుకున్నారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ సినిమా నుండి రాశీని తప్పించినట్లు తెలుస్తోంది. దాంతో తన పై బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయిందని ఈ ముద్దుగుమ్మ తెగ ఫీల్ అవుతుందట. రాశిఖన్నాకు మంచి సినీ సర్కిల్ ఉన్నా వాళ్ళెవరూ మళ్ళీ అవకాశాలు ఇస్తారని నమ్మకం లేకపాయే. ఒకవేళ ఇచ్చినా అడిగినంత ముట్టజెప్పరయ్యే. పాపం రాశీఖన్నా.