Homeఎంటర్టైన్మెంట్Tollywood Unmarried Heroines: 40 ఏళ్లు వచ్చినా నో మ్యారేజ్.. టాలీవుడ్ లో ఈ ముదురు...

Tollywood Unmarried Heroines: 40 ఏళ్లు వచ్చినా నో మ్యారేజ్.. టాలీవుడ్ లో ఈ ముదురు హీరోయిన్స్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు?

Tollywood Unmarried Heroines: పెళ్లంటే నూరేళ్ల బంధం. ఈ గొప్ప బంధంతో ఏకమై తమ జర్నీని కంటిన్యూ చేయడం ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే ప్రక్రియనే. కానీ కొందరు ఇప్పటికీ పెళ్లి చేసుకోవడానికి వెనకడుగువేస్తుంటారు. అసలు పెళ్లంటేనే ఆమడ దూరం వెళ్తున్నారు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలంటారు పెద్దలు. మరి మన సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ పెళ్లి కానీ భామలు ఎందరు ఉన్నారో తెలుసా?

పెళ్లి కానీ ప్రసాదుల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. అందులో అందరికి ముందుగా గుర్తు వచ్చేది అనుష్క శెట్టినే..ఎన్నో రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ భామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఆమె అభిమానులకు మరింత జోష్ ను నింపింది. అయితే ఈ అమ్మడు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఎప్పటి నుంచో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలని ఇద్దరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరు మేము స్నేహితులం మాత్రమే అని చెబుతుంటారు కానీ పెళ్లి విషయంపై స్పందించలేదు. ఇప్పటికే అమ్మడుకు 41 సంవత్సరాల వయసు. మరి ఇంకా ఈ బ్యూటీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

పూజా హెగ్డే: పూజా హెగ్డే సినిమాలనుంచి బ్రేక్ తీసుకుందా..? త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? ఇవే అనుమానాలు ప్రస్తుతం ఎక్కువగా అయ్యాయి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అమ్మడు క్రేజ్ మామూలుగా లేదు. ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఎన్నో డిజాస్టర్ లను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ మంచి ఆఫర్లు వచ్చినా కూడా కాదంటుందట. అందుకే పెళ్లి ఆలోచన ఏమైనా ఉందా? అందుకే వచ్చిన ఆఫర్లను రిజక్ట్ చేస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈమెకు ఇప్పటికే 31 సంవత్సరాలు ఉన్నాయట.

తమన్నా: జైలర్ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించిన తమన్నా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఈమె వయసు ఏకంగా 34 సంవత్సరాలు. అయితే నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉందనే వార్తలు వస్తున్నా ఇప్పటికీ వీటిపై క్లారిటీ లేదు.

శృతి హాసన్: కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. ఈ అమ్మడు వయసు కూడా 38 సంవత్సరాలట. 40కి దగ్గరగా వస్తున్నా కూడా ఇప్పటికీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు.

త్రిష: 39ఏళ్ళు ఉన్నా కూడా పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు త్రిష. రీసెంట్ గా ps సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు. గతంలో టాప్ హీరోయిన్ గా సాగిన త్రిష.. కొన్ని రోజులు సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనేంటో నిరూపించుకోవాలి అనుకుంటుందట.

ఇలియానా: 36 ఏళ్లు వయసు వస్తున్నా కూడా పెళ్లి మాట ఎత్తని ఇలియానా రీసెంట్ గా బేబీ బంప్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే తల్లి అవుతుందా? లేదా సైలెంట్ గా మ్యారేజ్ చేసుకుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తాప్సీ పన్ను: 34 ఏళ్లు ఉన్న తాప్సీ ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆమెకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. కానీ ఎందుకో ఈ భామ కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదు.

రష్మి గౌతమ్: రష్మీ గౌతమ్ వయసు చెబితే కచ్చితంగా ఆశ్యర్యపోతారు. జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది ఈ భామ. అయితే 40 సంవత్సరాల వయసు వచ్చిన ఈమె కూడా ఎందుకో పెళ్లి గురించి ప్రస్తావించడం లేదట. ఒకప్పుడు చిన్న చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లలో నటించినా.. పెద్దగా గుర్తింపు సంపాదించలేకపోయింది. కానీ ఒక్కసారిగా జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రీసెంట్ గా బోళా శంకర్ సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది ఈ భామ.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular