ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ఉగాది రోజున ఆయన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో పలువురు సెలబ్రెటీలు ‘వెల్ టు సోషల్ మీడియా’ అంటూ స్వాగతించారు. రాజమౌళి, మహేష్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఆయనకు ట్వీటర్లో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కలెక్షన్ మోహన్ బాబు చిరు ట్విట్టర్ ఎంట్రీని స్వాగతించారు. ‘మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ ‘ధన్యవాదాలు మిత్రమా.. రాననుకున్నావా.. రాలేననుకున్నావా..?’ అంటూ చమత్కరించిన సంగతి తెల్సిందే.
కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ వీరద్దరు ట్వీటర్లో అభిమానులు అలరిస్తున్నారు. చిరు ట్వీట్ కు ప్రతీగా మోహన్ బాబు మరోసారి ట్వీట్ చేశారు. ‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను..’ అంటూ మోహన్ బాబు చమత్కరించాడు. మోహన్ బాబు ‘హగ్’ కు చిరు తాజాగా రిప్లయ్ ఇచ్చాడు. ‘మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి.. నో హగ్స్, నో షేక్ హ్యాండ్స్.. ఓన్లీ నమస్తే.. సామాజిక దూరం తప్పనిసరి’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం. @KChiruTweets https://t.co/7u5N2S6gOZ
— Mohan Babu M (@themohanbabu) March 28, 2020
అదేవిధంగా కరోనాను ఎలా ఎదుర్కోవాలో.. మనకు దగ్గరగా ఉండేవారి నుంచి, మన బంధువుల నుంచి ఎలా రక్షణ పొందాలో మన మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన వీడియో చూడు.. అంటూ మోహన్ బాబు చిరు ట్వీట్ చేశారు. దీనికీ మోహన్ బాబు స్పందిస్తూ ‘మిత్రమా.. కరోనా మహమ్మారి తాత్కాలికం.. మన స్నేహం శాశ్వతం’ అంటూ ట్వీట్ చేశాడు. ట్వీటర్లో వీరి సంభాషణ చూసిన నెటిజన్లు ఇలాంటి ట్వీట్స్ నెవ్వర్ బీఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. మీడియాలో తరుచూ వీరిమధ్య గొడవలు కేవలం సృష్టేనని.. చిరు-మంచు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉందని వీరి సంభాషణ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. సినిమాలు రిలీజుకు నోచుకోని సమయంలో వీరద్దరు సినీప్రియులను సోషల్ మీడియాలో అలరిస్తుండటంతో అభిమానులు కాస్త సేదతీరుతున్నారు.