Homeఎంటర్టైన్మెంట్Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి అట్టర్ ప్లాఫ్.. మండిపడుతున్న ధోని ఫ్యాన్స్.. కారణం...

Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి అట్టర్ ప్లాఫ్.. మండిపడుతున్న ధోని ఫ్యాన్స్.. కారణం ఉంది భయ్యో..

Nitish Kumar Reddy: గెలుకుంటే వచ్చే దానిని వాసన అంటారు. వాసన భరించే శక్తి ఉంటేనే గెలుక్కోవాలి. లేదంటే మూసుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితి ఐపీఎల్ లో హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి ఎదురైంది. దీంతో అతడు కక్కలేక.. మింగలేక తీవ్రంగాఇబ్బంది పడతున్నాడు.

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 201 పరుగులు చేసినప్పటికీ గెలవలేకపోయింది. ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫాయిదా లేకుండా పోయింది. బౌలర్లు దారుణంగా విఫలం కావడంతో బెంగళూరు దర్జాగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 202 రన్స్ టార్గెట్ ను 15.4 ఓవర్లలోనే ఛేదించింది.

సన్ రైజర్స్ ఓటమిలో ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో అంచనాలు ఉన్న వీరు ముగ్గురు విఫలం కావడం జట్టు విజయంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా ఇషాన్ కిషన్ జట్టుభారాన్ని భుజస్కంధాలమీద మోయాల్సి వచ్చింది.

నితీష్ కుమార్ రెడ్డి ఒక్క పరుగుమాత్రమే చేసి ఔట్ కావడంతో సోషల్ మీడియాలో అతడిపై విపరీతంగా విమర్శలువస్తున్నాయి. ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ అతడి మీద మండిపడుతున్నారు. గతంలో ధోనిని ఉద్దేశించి నితీష్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మాదిరిగా ధోని బ్యాటింగ్ చేయలేడని, అతడికి టెక్నిక్ రాదని మండిపడ్డాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను ధోని అభిమానులు గుర్తు చేస్తున్నారు. బెంగళూరుపై నితీష్ కుమార్ రెడ్డి ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగుచేశాడు. నీ అద్భుతమైన ప్రతిభతో ఒక్క పరుగు చేశావ్ అంటూ అతడిని ఎద్దేవా చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version