https://oktelugu.com/

నిత్యా మీనన్ కాదన్నది.. మరి తాప్సీ అంత బరువు మోస్తుందా..?

కరణం మల్లేశ్వరి. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం. వెయిట్‌ లిఫ్టింగ్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోయించిన ఆమె ఎంతో మందికి అదర్శంగా నిలిచింది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి.. అంతగా మద్దతులేని క్రీడలో దేశం గర్వించే స్థాయికి ఎదిగిన మల్లేశ్వరి జీవితం సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు. అందుకే ఆ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ఎం.వి.వి. సత్యనారాయణ, కోన వెంకట్‌ ఈ మధ్యే ప్రకటించారు. వీరిద్దరి […]

Written By:
  • admin
  • , Updated On : June 4, 2020 / 02:38 PM IST
    Follow us on

    కరణం మల్లేశ్వరి. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం. వెయిట్‌ లిఫ్టింగ్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోయించిన ఆమె ఎంతో మందికి అదర్శంగా నిలిచింది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి.. అంతగా మద్దతులేని క్రీడలో దేశం గర్వించే స్థాయికి ఎదిగిన మల్లేశ్వరి జీవితం సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు. అందుకే ఆ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ఎం.వి.వి. సత్యనారాయణ, కోన వెంకట్‌ ఈ మధ్యే ప్రకటించారు. వీరిద్దరి నిర్మాణంలో సంజనా రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మల్లేశ్వరి పుట్టినరోజు అయిన జూన్ 1న అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

    ఎన్నో పతకాలు సాధించిన దిగ్గజ వెయిట్ లిఫ్టర్ మల్లేశ్వరి పాత్రను ఎవరు పోషిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ సమాచారం మేరకు ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ ముగ్గురు హీరోయిన్లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ముగ్గురు నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ. అయితే, మొదటగా నిత్యా మీనన్‌ను సంప్రదించగా.. ఈ ఆఫర్ను ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. దాంతో, రకుల్ లేదా తాప్సీలో ఒకరిని ఖాయం చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ ఇద్దరిలోనూ తాప్సీ అయితేనే బెటర్ అని అనుకుంటున్నారని సమాచారం. ఎందుకంటే చిత్రాన్ని వివిధ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. పైగా, క్రీడా నేపథ్య సినిమా కావడంతో మల్లేశ్వరి పాత్రలో నటించి హీరోయిన్‌కు ఫిట్నెస్‌పై అవగాహన ఉండాలి. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటే మరీ మంచిది. ఫిట్‌నెస్ పరంగా రకుల్‌ ఎదురు లేదు. కానీ, ఈ మధ్య బాలీవుడ్‌లో వరుస హిట్లతో తాప్సీ దూసుకెళ్తోంది. నటన విషయంలోనూ ఆమెకు ఎదురు లేదు. కాబట్టి తాప్సీ అయితేనే మల్లేశ్వరి పాత్రకు సూటవుతుందని చిత్ర యూనిట్‌ తుది అంచనాకు వచ్చిందట. ఆమెకు కథ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే హైదరాబాద్ లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో నటిస్తున్న తాప్సీ మరో స్పోర్ట్స్‌ బయోపిక్‌కు ఓకే చెబుతుందా? మల్లేశ్వరి పాత్రలో బరువులు మోస్తుందా? చూడాలి.