nithya menon: తమ చిన్ననాటి ఫొటోలు చూసుకుని ఎవరైనా సరే చాలా మురిసిపోతుంటారు. తాము బాల్యంలో అలా ఉన్నామా అని ఊహించుకుని ఆ ‘నాటి’ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుని ఆనందంగా గడిపేస్తుంటారు. చిన్ననాటి చిత్తరువులన్నిటినీ భద్రంగా దాచుకుంటారు కూడా. కాగా, ఇటీవల కాలంలో సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా వేదికగా తమ చిన్న నాటి ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ త్రోబ్యాక్ ఫొటో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..

స్టార్ హీరోయిన్ ఫొటోను చూసి .. ఈ చిన్నారి చిన్నపుడు ఎంత ముద్దుగా ఉందో అని అనుకుంటున్నారు. సదరు హీరోయిన్ ఫొటోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన ఆ భామ.. ఎవరు.. చిత్తరువులో గుర్తుపట్టకుండా ఉన్న ఈ చిన్నారి ఎవరంటే.. ‘నిత్యామీనన్’. ఆ ఫొటోలో అందాల చందమామగా కనబడుతోంది. అందమైన చిన్ని డ్రెస్సులో అమాయకంగా కెమెరా వైపునకు చూస్తూ ఫోజులిస్తోంది నిత్యామీనన్.
Also Read: నేచురల్ స్టార్ నాని గాలి తీసిన ఎమ్మెల్యే రోజా..
అందంతో పాటు అభినయం ఉన్న నటిగా నిత్యామీనన్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ప్రయారిటీ ఇస్తూ సిల్వర్ స్క్రీన్‌పైన తనదైన అభినయంతో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న ఈ సుందరి.. 1989, ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టింది. ‘ది మంకీ హు న్యూ టు మచ్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిస్ట్ విద్యను పూర్తి చేసిన నిత్యా మీనన్‌కు పాత్రికేయ రంగంలోకి వెళ్లాలని కోరిక ఉండేది. కానీ, ఈమె ప్రజెంట్ యాక్ట్రెస్‌గా సెటిల్ అయిపోయింది.
నిత్యా మీనన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. యాక్ట్రెస్‌గానే కాకుండా మంచి సింగర్ గానూ పేరు సంపాదించుకుంది. ‘సెవనో క్లాక్’ మూవీతో టాలీవుడ్ చిత్ర సీమకు పరిచయమైన నిత్య.. ‘అలా మొదలైంది’ సినిమాతో బాగా పాపులర్ అయింది. ఈ చిత్రంలో తన నటనకుగాను నిత్యామీనన్ ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకుంది.
సౌత్ లాంగ్వేజెస్ అన్నిటిలో దాదాపుగా యాక్ట్ చేసిన నిత్యామీనన్.. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల సరసన నటించిన నిత్యా మీనన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్‌గా ‘భీమ్లా నాయక్’ పిక్చర్‌లో నటిస్తోంది. ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ ఫిల్మ్ రిలీజ్ కానుంది. ఇకపోతే నిత్యా మీనన్ నటించిన ‘స్కైలాబ్’ చిత్రం ఇటీవల విడుదలైంది.
Also Read: ఎన్టీఆర్ – చరణ్ మధ్య ఫైట్.. ఆర్ఆర్ఆర్ పై లేటెస్ట్ అప్ డేట్ !