Nithin: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న హీరో నితిన్, తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడు?, అసలు ఇప్పట్లో సినిమాలు చేస్తాడా?, నితిన్ తో సినిమాలు తీసే నిర్మాతలు ఇంకా ఉంటారా?, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నితిన్, కం బ్యాక్ ఇస్తే చూడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. కానీ నితిన్ ఒకప్పటి లాగ ఇప్పుడు కం బ్యాక్ ఇవ్వడం కష్టమేనెమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అదిరిపోయే కాంబినేషన్ ని సెట్ చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సరికొత్త కథాంశాలతో సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన VI ఆనంద్ తో నితిన్ త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాడట.
ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేసారు. ఈ పోస్టర్ లో నితిన్ స్టైల్ గా సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ లో ‘నో బడీ..నో రూల్స్’ అనే ట్యాగ్ ఉంటుంది. అంటే హీరో క్యారక్టర్ ఏంటో కేవలం ఈ పోస్టర్ తోనే చెప్పకనే చెప్పారు మేకర్స్. హీరో ఇందులో ఎవరినీ లెక్క చేయడు, ఎలాంటి రూల్స్ ని అనుసరించడు, తనకు నచ్చింది చేసుకుంటూ పోతాడు. ఆ పరిణామాల వల్ల ఎదురయ్యే సంఘటనలకు, VI ఆనంద్ మార్క్ సైన్స్ ఫిక్షన్ ప్రపంచం తోడైతే, కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలనే నెలకొల్పుతుంది అనొచ్చు. ఆ రేంజ్ లో వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
భీష్మ చిత్రం తర్వాత వరుసగా 14 డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న నితిన్, ‘ఇష్క్’ అనే కూల్ లవ్ స్టోరీ తో సూపర్ హిట్ ని అందుకొని భారీ కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయ్యాయి, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ అయ్యాయి, కొన్ని యావరేజ్ గా మిగిలాయి. కానీ ‘భీష్మ’ తర్వాత నితిన్ కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. వరుసగా 7 డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఆయనకు ఇష్క్ ముందు రోజులు ఎదురు అయ్యాయి. ఆ రోజులను ఛేదించి ఇష్క్ తో ఎలా కం బ్యాక్ ఇచ్చాడో, ఈ సినిమాతో కూడా నితిన్ అలాంటి కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.