https://oktelugu.com/

Nithin ‘Maestro’ trailer talk: నితిన్ ‘మ్యాస్ట్రో’ క్రైమ్ మిస్టరీ

Nithin Maestro trailer talk: యంగ్ హీరో నితిన్ (Nithin) ఈ మధ్య ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తున్నాడు. ఇటీవలే ‘చెక్’ అనే మూవీని తీసిన నితిన్ ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండానే మరో మూవీని తీసి ఏకంగా విడుదలకు రెడీ చేశాడు. నితిన్, తమన్నా, నభా నటేశ్ జంటగా రూపొందిన చిత్రం ‘మ్యాస్ట్రో’(Maestro). యువ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాంటి చిత్రాన్ని థియేటర్లలో […]

Written By: , Updated On : August 23, 2021 / 07:29 PM IST
Follow us on

Nithin Maestro trailer talk: యంగ్ హీరో నితిన్ (Nithin) ఈ మధ్య ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తున్నాడు. ఇటీవలే ‘చెక్’ అనే మూవీని తీసిన నితిన్ ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండానే మరో మూవీని తీసి ఏకంగా విడుదలకు రెడీ చేశాడు.

నితిన్, తమన్నా, నభా నటేశ్ జంటగా రూపొందిన చిత్రం ‘మ్యాస్ట్రో’(Maestro). యువ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాంటి చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నారు.

తాజాగా చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ఒక గుడ్డివాడుగా నితిన్ ఈ సినిమాలో నటించాడు. ‘కళ్లు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తోనే ట్రైలర్ ప్రారంభమైంది. నితిన్ అంధుడిగా ఒక హత్య కేసు శోధనలో ఎలా పాలుపంచుకుంటాడన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించారు.

తమన్నా ఒకరిని హత్య చేయడం.. పోలీసులు ఇరికించడం.. నితిన్ సాక్ష్యంగా ఉండడం లాంటి ఆసక్తికర కథా కథనం ఈ ట్రైలర్ లో కనిపించింది. చివర్లో కళ్లు కనపడే నితిన్ ఇలా ఎందుకు గుడ్డివాడుగా నటించాడన్నడి ఆఖర్లో ట్విస్ట్ ఇచ్చాడు.

హిందీలో హిట్అయిన ‘ఆంధాధున్’ రిమేక్ గా రూపొందిని ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా ఉంది. క్రైమ్ సన్నివేశాలు చూస్తుంటేనే ఉత్కంఠ రేపుతున్నాయి. నితిన్ నట, అభినయం ఆకట్టుకుంది.

మ్యాస్ట్రో ట్రైలర్ ను కింద చూడొచ్చు..

Maestro | Official Trailer | Nithiin, Tamannah Bhatia, Nabha Natesh, Jissu Sen Gupta | September 17