హీరో నితిన్ కెరీర్ మొదటి నుంచి ప్లాప్ లు హిట్ ల మధ్య ఊగిసలాడుతూ ఉంది. గత ఏడాది భీష్మతో భారీ హిట్ అందుకుని ఊపు మీదకు వచ్చాడు అనుకునే లోపే.. మళ్ళీ ఈ ఏడాది ఇప్పటికే రెండు ఫ్లాపులు అందుకుని అంతలోనే డీలా పడ్డాడు. అయితే, రిజల్ట్ తో తనకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు తన సినిమాలను వరుసగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు నితిన్.
పైగా చాలా తక్కువ గ్యాప్ లోనే ఈ ఏడాది మూడో సినిమాని కూడా విడుదలకు రెడీ చేశాడు. అయితే థియేటర్ లోకి తీసుకొచ్చి అది కాస్త ప్లాప్ అయితే, ఇక ఉన్న ఆ క్రేజ్, అలాగే మార్కెట్ కూడా పోయే ఛాన్స్ ఉంది. మొత్తానికి అసలు విషయం అర్థం చేసుకొని, తన కొత్త సినిమా ‘మాస్ట్రో’ సినిమాని థియేటర్ లోకి తీసుకు రాకుండా ఓటీటీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు.
ఆగస్టులో హాట్ స్టార్ వేదిక పై ‘మాస్ట్రో’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం మేకర్స్ 27 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమాని 30 కోట్లకు హాట్ స్టార్ కొనుక్కుంది. శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్ ఓటీటీ వంటి అన్ని రైట్స్ ను హాట్ స్టార్/స్టార్ గ్రూప్ తీసుకున్నాయి. అంటే నిర్మాతకు మూడు కోట్లు లాభం. పైగా హిందీ డబ్బింగ్ రైట్స్ ఇంకా నిర్మాత వద్దే ఉన్నాయి.
హిందీ రైట్స్ కు ఈజీగా ఎనిమిది కోట్ల వచ్చే అవకాశం ఉంది. అంటే, ఎలాంటి రిస్క్ లేకుండా 11 కోట్ల లాభాన్ని అందుకున్నాడు నిర్మాత. ఈ సినిమాకి నిర్మాత నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డినే. సొంత సినిమా కాబట్టి థియేటర్ లో విడుదల చెయ్యాలని మొండిగా వెయిట్ చెయ్యకుండా నితిన్ కూడా లాభం కోసం సైలెంట్ గా ఓటీటీ రిలీజ్ కి మొగ్గు చూపాడు.
అయితే, ఇదే వేరే నిర్మాత అయి ఉంటే నితిన్ ఒప్పుకునేవాడా ? ఈ ప్రశ్నకు నితినే సమాధానం చెప్పగలడు. నిజానికి ఈ సినిమా అవుట్ ఫుట్ పై మొదటి నుండి అనుమానమే. సినిమా సరిగ్గా రాలేదని, రెండు షెడ్యూల్స్ ను రీషూట్ కూడా చేశారు. పైగా ఈ సినిమా ప్లాప్ అవుతుందని నితిన్ తన సన్నిహితుల దగ్గర కూడా ఓపెన్ అయ్యాడు. అలాంటి ఒక ప్లాప్ సినిమా 11 కోట్లు లాభాలను అందుకోవడం అంటే గ్రేటే.