Nisha Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతున్నసంగతి తెలిసిందే. కాగా కాజల్ అగర్వాల్‌తో దిగిన క్యూట్ ఫొటోను ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ఇన్‌స్టాలో షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ‘నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. ఈ గర్భంలో ఉన్న నిన్ను నేను తాకుతున్నా. నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా లిటిల్ లవ్’ అంటూ ఎమోషనల్ అయిపోతూ ఒక మెసేజ్ పెట్టింది.

పైగా నిషా ఇంకా మెసేజ్ చేస్తూ.. ‘కాజల్, గౌతమ్‌లిద్దరూ ఎప్పటికీ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా. తల్లిదండ్రుల జీవితాన్ని ప్రారంభించిన మీకు మంచి జరగాలి’ అని పోస్టు చేసింది. ఇక రీసెంట్ గా కాజల్ అగర్వాల్ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. కాజల్ భర్త గౌతమ్ కిచ్లుతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
Also Read: పవన్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన నాగబాబు.. బోడిగుండు పోస్టుతో ఇలా చేశారేంటి
ఈ సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. కాజల్ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది అని ఆమె అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక కాజల్ అగర్వాల్ నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే, హే సినామిక సినిమాలోనూ దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ నటించింది.

ఈ సినిమా వచ్చేనెల 3న విడుదల కానుంది. చాలా కాలం పాటు కాజల్ అగర్వాల్ స్టార్‌డమ్‌ను చూపిస్తూ వచ్చింది. కాజల్ దాదాపు దశాబ్ద కాలం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది.
Also Read: ఇండస్ట్రీ పెద్దల మౌనాన్ని ఈ ఒక్క ట్వీట్ తో పవన్ కడిగేశాడా?
Recommended Video: