Custody Collections: పాపం అక్కినేని ఫ్యామిలీ కి ఈమధ్య ఏది కలిసి రావడం లేదు, చేస్తున్న సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. థాంక్యూ మూవీ తో ప్రారంభమైన అక్కినేని ఫ్యామిలీ పరంపర మొన్న ఏజెంట్ సినిమా వరకు కొనసాగింది.ఈ ఫ్లాప్ స్ట్రీక్ కి నాగ చైతన్య ‘కస్టడీ’ సినిమాతో బ్రేక్ వేస్తాడు అనుకుంటే ఆయన కూడా చేతులెత్తిసినట్టుగా అనిపిస్తుంది.
మంచి టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకున్న ‘కస్టడీ’ చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలైంది. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ కి వెళ్తుందో ఇప్పుడే చెప్పలేము కానీ, ఓపెనింగ్స్ మాత్రం ‘ఏజెంట్’ కంటే తక్కువే వచ్చేట్టు అనిపిస్తుంది. ఏజెంట్ చిత్రానికి మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ‘కస్టడీ’ మూవీ కి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రావడం కష్టం అంటున్నారు ట్రేడ్ పండితులు. హైదరాబాద్ మెయిన్ థియేటర్స్ చాలా చోట్ల మొదటి ఆట నుండే హౌస్ ఫుల్స్ లేవు. సోషల్ మీడియా లో USA ప్రీమియర్స్ నుండి వచ్చిన నెగటివ్ టాక్ ప్రభావం గట్టిగానే పడింది.
పబ్లిక్ లో కూడా పాజిటివ్ టాక్ లేకపోవడం తో కలెక్షన్స్ పై చాలా తీవ్రమైన ప్రభావం పడింది.ఇక ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి, ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి లక్ష 50 వేల డాలర్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఏజెంట్ కి కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు మూడు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, చూడాలి మరి.