Nikhil Remuneration: ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి కార్తికేయ 2..యంగ్ హీరో నిఖిల్ హీరో గా నటించిన ఈ చిత్రం అంచనాలకు మించి బాక్స్ ఆఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..ముఖ్యంగా హిందీ వర్షన్ లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా అది తక్కువ అవుతుంది..6 లక్షల రూపాయిల నెట్ వసూళ్లతో ప్రారంబైన ఈ సినిమా నేడు అక్కడ 30 కోట్ల రూపాయిలను వసూలు చేసేలా చేసింది..ఇప్పటి వరుకు హిందీ తెలుగు వెర్షన్స్ కి కలిపి 50 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాల లిస్ట్ లోకి చేరిపోయింది..లాంగ్ రన్ కూడా ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు..ఫుల్ రన్ లో ఈ సినిమా 65 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఒక్క సినిమాతో నిఖిల్ ఏకంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన హీరోల లిస్ట్ లోకి వెళ్లిపోవడం తో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది..నిఖిల్ సినిమా అంటే కచ్చితంగా వైవిద్యం ఉంటుంది అనే బ్రాండ్ విలువలను ఆడియన్స్ మైండ్ లో నింపేసాడు నిఖిల్..నిన్న మొన్నటి వరుకు కేవలం 15 కోట్ల రూపాయలకే పరిమితమైన ఆయన మార్కెట్ ఇక నుండి 30 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచానా వేస్తున్నాయి.

దీనితో నిఖిల్ కూడా తన పారితోషికం ని డబుల్ చేసాడు..ఇది వరుకు ఆయన ఒక్కో సినిమా కి నాలుగు నుండి ఆరు కోట్ల రూపాయిల పారితోషికం తీసుకునేవాడు..కానీ ఇప్పుడు ఏకంగా 12 కోట్ల రూపాయిలను డిమాండ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అంతే కాకుండా కథ డిమాండ్ ని బట్టి ఆయన లాభాల్లో వాటాలు కూడా అడుగుతున్నాడట..కానీ ఒక్క సినిమాతోనే నిఖిల్ తన రెమ్యూనరేషన్ ని ఈ రేంజ్ లో పెంచేసాడు, మనకి వర్కౌట్ అవుతుందా లేదా అనే మీమాంసలో పడ్డారట దర్శక నిర్మాతలు..మరి ఈ నయా పాన్ ఇండియన్ హీరో రేంజ్ తదుపరి సినిమా నుండి ఎలా ఉంటుందో చూడాలి మరి.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ