Spy Movie Teaser Review: సబ్జెక్ట్స్ ఎంపికలో నిఖిల్ తనకు సాటి లేదని నిరూపించుకుంటున్నారు. ఆయన సక్సెస్ సీక్రెట్ అదే. లేటెస్ట్ మూవీ స్పై టీజర్ చూసాక ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఆయనకు మరో భారీ హిట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మరణం పెద్ద మిస్టరీ. 1945లో విమాన ప్రమాదంలో ఆయన మరణించారనేది ఒక వాదన. అలాగే విదేశాల్లో ఆయన బంధీ కాబడ్డారని, జైలులోనే మరణించారని మరొక వాదన. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలని ఇండియన్ గవర్నమెంట్ ని ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటి నుండో కోరుతున్నారు. ఇండియన్ గవర్నమెంట్ కి ఈ విషయం తెలిసినా వెల్లడించడం లేదనే మరో కోణం కూడా ఉంది.
కాబట్టి నేతాజీ మరణం పర్ఫెక్ట్ థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ సబ్జెక్టు. దానికి స్పై యాక్షన్ జోడించి నిఖిల్ ఈ మూవీ చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన టీజర్ ఉత్కంఠరేపుతూ సాగింది. స్పై మూవీ కథ ఏమిటో టీజర్లో చెప్పేశారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న నిజాన్ని, రహస్యాలను చేధించేందుకు హీరో బయలుదేరుతాడు. ఈ క్రమంలో ఆయన చేసిన సాహసాల సమాహారమే స్పై మూవీ.
స్పై మూవీ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. యాక్షన్ ఓ రేంజ్ లో ఉంది. థ్రిల్లింగ్ అండ్ సస్పెన్సు అంశాలతో ఆకట్టుకుంది. స్పై మూవీ కోసం నిఖిల్ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. మకరంద్ దేశ్ పాండే కీలక రోల్ చేశారు. ఐశ్వర్య మీనన్, తాన్యా ఠాకూర్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కింది. జూన్ 29న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.
ట్రైలర్ స్పై చిత్రం మీద అంచనాలు పెంచేసింది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు దుమ్ముదులపడం ఖాయం. ఇక కార్తికేయ మూవీతో నిఖిల్ పాన్ ఇండియా హిట్ కొట్టారు. హిందీలో కూడా కార్తికేయ 2 సత్తా చాటింది. నార్త్ ఇండియాలో ఆయనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి స్పై హిందీలో సంచనాలు చేసే ఆస్కారం లేకపోలేదు.