Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: అల్లు అర్జున్ "పుష్ప" మూవీ నుంచి అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్...

Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” మూవీ నుంచి అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్…

Pushpa Movie: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ ల కాంబినేష‌న్లో తెరకెక్కుతున్న చిత్రం ” పుష్ప”. ఆర్య, ఆర్య 2 తర్వాత  వీరిద్దరు కలిసి ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో పాన్‌ ఇండియా లెవెల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 17 వ తేదీన విడుదల కాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు ఓ అప్డేట్ ప్రకటించారు.

new update from pushpa movie makers

తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న సునీల్ పాత్ర గురించి అప్డేట్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సునీల్ మంగళం శ్రీను అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మేరకు ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రేపు 10 గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్‌ దుమ్ము లేపుతున్నాయి. సాంగ్స్ అయితే యూ ట్యూబ్‌ లో ట్రెండింగ్ గా నిలిస్తున్నాయి. ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా… మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో టీజర్లు, పోస్టర్లు జనాల్లో భారీ అంచానలనే పెంచేస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular