‘Sunshine’ New OTT Platform: మలేషియాలో ఎస్టాబ్లిష్డ్ డ్ అయిన `సన్ షైన్` ఓటీటీ సంస్థని త్వరలో ఇండియాలో తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ తో (టియఫ్ సిసి) తో టయ్యప్ అవుతూ ప్రారంభించబోతున్నారు `సన్ షైన్ ` సిఎమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి. ఈ సందర్భంగా ఈ రోజు ఎఫ్ ఎన్ సీసీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Also Read: Big Producer: గుసగుస: వారసుడి కోసం కోడలుపై ఆ బడా నిర్మాత అరాచకపర్వం..!?
ఈ కార్యక్రమంలో టియఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“`ఇప్పటికే మలేషియాలో ఎస్టాబ్లిష్ అయిన సన్ షైన్ ఓటీటీ సంస్థని ఇండియాలో మా టియఫ్ సీసీతో కలిసి ప్రసాద్ గారు త్వరలో ప్రారంభించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఓటీటీల హవా నడుస్తోంది. ఈ ఓటీటీ ద్వారా తెలుగు తో పాటు అన్ని భాషల చిత్రాలు రిలీజ్ చేయనున్నాం. అలాగే షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ కూడా రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా స్తబ్దతలో ఉన్న విషయం తెలిసిందే. నేను గతంలో తెలుగు ఫిలించాంబర్‌లో ప్రొడ్యూసర్ సెక్టార్ ప్రెసిడెంట్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా, సెక్రటరీగా, తెలుగు ఫిలించాంబర్ ఈసీ మెంబర్ గా అనేక సార్లు పని చేసిన అనుభవంతో…నిర్మాతల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వాటితో ఏమాత్రం ఏకీభవించను. సినిమా నిర్మాత అనేవాడు తన సినిమాను ఎప్పుడు అమ్మాలో అనేది తనే నిర్ణయించుకోవాలి తప్ప…ఏ అసోసియేషనో , మరో సంస్థో చెప్పడం కరెక్ట్ కాదు. నిర్మాత డబ్బు ఎక్కడ వస్తే అక్కడే ఇచ్చుకునే అవకాశం ఉండాలి. థియేటర్స్ ఇవ్వరు…ఓటీటీ లో అమ్ముకునే అవకాశం ఇవ్వమంటే ఎలా? నిర్మాత కు తన సినిమాను తనే అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. నిర్మాతలపై ఏ అసోసియేషన్ కండీషన్ పెట్టొద్దు. ఒకవేళ పెడితే రిలీజ్‌కి థియేటర్స్ కూడా పర్సేంటేజ్ విధానంలో ఇవ్వాలి…ఇదే మా టియఫ్ సిసి డిమాండ్. మా చాంబర్ ఎప్పుడూ నిర్మాతలకు అండగా ఉంటుంది“ అన్నారు.
టియఫ్‌సిసి వైస్ ఛైర్మన్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ…“ప్రస్తుతం చిన్న నిర్మాతలకు థియేటర్స్ దొరకని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓటీటీ సంస్థలు రావడం వల్ల చిన్న నిర్మాతలకు ఒకింత మేలు కలుగుతోంది. కొత్త టాలెంట్ ఇలాంటి ఓటీటీ సంస్థల ద్వారా బయటకు వస్తోంది. ఇలాంటి ఓటీటీ సంస్థలు మరిన్ని వస్తే ఇంకా కొత్త నిర్మాతలు వస్తారు. సినిమా ఇండస్ట్రీ లో మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. అందుకే ఓటీటీ సంస్థలను మా టియఫ్ సీసీ ప్రోత్సహిస్తుంది. అంతే తప్ప థియేటర్స్ వాళ్లను ఇబ్బంది పెట్టాలని కాదు. ఇకపై ఏ ఓటీటీ సంస్థ వచ్చినా మేము ప్రోత్సహిస్తాం“ అన్నారు.
నిర్మాత తరుణి రెడ్డి మాట్లాడుతూ…“సన్ షైన్ “ ఓటీటీ సంస్థ లోగో లాంచ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఓటీటీ సంస్థల వల్ల న్యూ టాలెంట్ బయటకు వస్తుంది. చిన్న నిర్మాతలు వస్తారు. లో బడ్జెట్ చిత్రాలు వస్తాయి“ అన్నారు.
సన్ షైన్ సియమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి మాట్లాడుతూ…“లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ సంస్థలు ప్రారంభమై పబ్లిక్ లో కి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. దీనిపై నేను రెండేళ్ల పాటు వ్యూయర్ షిప్, రెవెన్యూ ఎలా? ఏంటనే విషయాలపై రీసెర్చ్ చేసి సన్ షైన్ అనే పేరుతో ఓటీటీ సంస్థ ప్రారంభించాం. ప్రస్తుతం ఇండియాలో టియఫ్ సిసి వారితో కొలాబిరేట్ అవుతూ ఏర్పాటు చేయబోతున్నాం. అన్ని భాషల చిత్రాలు మా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నాం. ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాలు బ్యాంక్ ఉంది. అలాగే ఒరిజినల్ కంటెంట్ కూడా ఉంది. అలాగే న్యూ జనరేషన్ ని ఎంకరేజ్ చేయడానికి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా పెట్టనున్నాం. ప్రతి ఏజ్ గ్రూప్ కి నచ్చే విధమైన కంటెంట్ మా ఓటీటీలో పొందు పరచాలని అన్నది మా లక్ష్యం. త్వరలో మా ఓటీటీ సంస్థని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాం“ అన్నారు.
Also Read: Kumbhakarna’s sleep in Ramayana: కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడు? ఆ కారణం ఏంటి?
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: New sunshine ott platform logo launch
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com