Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమాలో ’ కొత్త సీన్లు యాడ్ చేశారు. ఇక అందరూ ‘ఊ’ అనాల్సిందే అంటూ బన్నీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా థియేటర్ లో 2 గంటల 59 నిమిషాల ఉండగా, ఓటీటీలో మాత్రం 2 గంటల 55 నిమిషాలు ఉంది.

పైగా ఇందులో కొన్ని అనవసర సీన్లను తీసేసి, కొన్ని కొత్త సీన్లను జోడించారు. ముఖ్యంగా సమంత ఊ అంటావా పాటలోనూ కొన్ని హాట్ విజువల్స్ ను యాడ్ చేశారు. అలాగే ఈ ‘ఊ అంటావా మావా..’ ఫుల్ వీడియో సాంగ్ ను చిత్రబృందం యూట్యూబ్‌లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైగా పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ ‘ఊ అంటావా మావా..’ అంటూ బాక్సాఫీస్ ను ఊపేసింది.
ప్రస్తుతం ఈ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. మెయిన్ గా సమంత గ్లామర్, బన్నీ స్టెప్పులు అభిమానులను బాగా అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకుని మొత్తానికి 18వ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించింది. నేటికీ కొన్ని చోట్ల ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజానికి మొదటి రోజు నుంచీ ‘పుష్ప’ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా ఆ తర్వాత బాగా పుంజుకుని ఇండియన్ సినిమాగా దాదాపు 300 కోట్లు వసూళ్లు చేసింది. అయితే ముందే అనుకున్నంతా జరిగింది. ఏపీ టికెట్స్ ధరలు పుష్ప చిత్రాన్ని ప్లాప్ వెంచర్ గా మార్చేశాయి. ఏపీలో దాదాపు అన్ని ఏరియాల్లో పుష్ప నష్టాలను చవి చూసింది. మూవీ విడుదల తర్వాత మరింత దుర్భర పరిస్థితులు ఏర్పడగా పెట్టుబడి కూడా రాబట్టలేకపోయింది.
Also Read: Sid Sriram: స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ కొత్త అవతారం?
దాంతో బయ్యర్లకు నిర్మాతలు కొంత డబ్బు వెనక్కి ఇచ్చారు. ఆంధ్రాలో టికెట్స్ ధరలు ఇదే తీరున కొనసాగితే భవిష్యత్ లో తెరకెక్కనున్న భారీ చిత్రాలు తమ బడ్జెట్ విషయంలో పునరాలోచించాల్సిందే. తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని సినిమా బడ్జెట్, స్టార్స్ రెమ్యూనరేషన్స్ నిర్ణయించాల్సి ఉంటుంది.
Also Read: Sonu Sood quits : సోనూసూద్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే !