Trivikram Vijay Bhaskar: ఒక మంచి సినిమా రావాలి అంటే రైటర్ డైరెక్టర్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి వాళ్ల మధ్య ఉన్న ర్యాపో వల్లనే ఒక మంచి సినిమా బయటికి వస్తుంది. అలా ఒక్క సినిమా రావడం చాలా కష్టం అని అందరూ అంటు ఉంటారు. కానీ త్రివిక్రమ్ విజయ భాస్కర్ గారి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇండస్ట్రీలో ఏదైనా సినిమా వచ్చిందంటే అది వీళ్ళ కాంభినేషన్ లో వచ్చిన సినిమానే అని చెబుతూ ఉండేవారు.
ఇక వీళ్ల సినిమాలు విజయాలను అందుకోవడమే కాకుండా అందులో కొన్ని క్లాసికల్ గా కూడా మిగిలిపోయాయి. ఇక ఇలాంటి వీళ్ళ కాంబినేషన్ చాలా సంవత్సరాల నుంచి మళ్లీ రిపీట్ కావడం లేదు. ఇక త్రివిక్రమ్ కూడా డైరెక్టర్ గా మారడం తో ఆయన వేరే వాళ్లకు ఎవరికి కూడా కథలు ఇవ్వకుండా తన సినిమాలకు మాత్రమే కథలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అందువల్లే వాళ్ళిద్దరి మధ్య రావాల్సిన సినిమాలు ఏవీ కూడా రాకుండా అయిపోయాయి.
ఇక వీళ్ల కాంబినేషన్ లో సినిమా రావాలని చాలా రోజుల నుంచి చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. అయినప్పటికీ అది ఇప్పటివరకు అయితే వర్కౌట్ కాలేదు. ఇక ఈ కాంబో లో సినిమా రాడు అని అందరూ అనుకున్నారు కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ వీళ్ల కాంబినేషన్ లో ఇప్పుడు ఒక సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కి త్రివిక్రమ్ కథ మాటలు అందిస్తున్నాడు. ఇక దీనికి డైరెక్టర్ గా విజయభాస్కర్ వ్యవహరించనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ కానప్పటికీ వీళ్ళ కాంబినేషన్ మాత్రం మళ్లీ రిపీట్ అవుతున్నందుకు అభిమానులు అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి సూపర్ సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ కాంబినేషన్ ఇప్పటికైనా సెట్ అయింది అంటు ఇండస్ట్రీలో చాలామంది సంతోష పడుతున్నారు. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్ల జోడి ఏదైనా ఉంది అంటే అది వీళ్ళ ఇద్దరిదే…త్రివిక్రమ్ రాసిన కథ, మాటల్ని ఓన్ చేసుకొని తెరకెక్కించడం లో విజయ భాస్కర్ గారి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రైటర్ రాసింది డైరెక్టర్ ఎలా తీయాలి అనే సందిగ్ధం లో ఉంటాడు. కానీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలను చూస్తే త్రివిక్రమ్ కి విజయ భాస్కర్ కి మధ్య ఎంత అండర్ స్టాండింగ్ ఉంటుందో మనకు అర్థం అవుతుంది…