https://oktelugu.com/

Kanguva Movie : హైప్ కాదు ఓవర్ హైప్.. అందుకే కంగువాకు ఈ పరిస్థితి?

2021 లో జై భీమ్ అనే సినిమాతో వచ్చిన సూర్య తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ET అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా భారా డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంది. ఎందుకో గానీ ఈ సినిమా తర్వాత సోలో హీరోగా సూర్య కనిపించింది లేదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 17, 2024 / 01:25 PM IST

    Kanguva Movie

    Follow us on

    Kanguva Movie :  ఫేవరేట్ హీరో అయినా నార్మల్ హీరో అయినా కథ నచ్చిందా హిట్ ఇస్తాం. లేదంటే తట్టుకోలేని బాధను ఇస్తాం అంటున్నారు నెటిజన్లు. రీసెంట్ గా కంగువా విషయంలో కూడా ఫ్యాన్స్ ఇదే ఫాలో అవుతున్నారు నెటిజన్లు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. లేదు. అదే రేంజ్ లో తెలుగులో కూడా ఉంది. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా కళ్లుల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురుచూచ్తారు. సూర్య సైతం తెలుగు ప్రేక్షకులకు ఆయన కూడా కనెక్ట్ అయ్యారు.

    2021 లో జై భీమ్ అనే సినిమాతో వచ్చిన సూర్య తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ET అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా భారా డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంది. ఎందుకో గానీ ఈ సినిమా తర్వాత సోలో హీరోగా సూర్య కనిపించింది లేదు. మధ్యలో విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా క్యామియోలో కనిపించాడు. ఈ సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. అయితే అది మొత్తం కమల్ ఖాతాలోకి వెళ్లిందనే చెప్పాలి.

    మూడు సంవత్సరాల తర్వాత కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ తమిళ్ హీరో. అయితే తెలుగులో యావరేజ్ సినిమాలు, తమిళ్ లో ఒక మోస్తారు సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శివ గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కదా. అయితే ఈయన దర్శకత్వం వహించిన కంగువ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై KE జ్ఞానవేల్ రాజా.. యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మించారు. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాను నిర్మిస్తుంటే.. మేకర్స్ ఒకటికి వంద కల్పించి హైప్ ఇస్తారు అన్న విషయం తెలిసిందే. సినిమాపై అంచనాలను పెంచడానికి మా సినిమా హిట్ అవ్వకపోతే మేము సినిమాలు తీయడం మానేస్తాం.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం.. వంద కోట్ల సినిమా.. మా హీరో అదరగొట్టేసాడు.. లాటి మాటలు ప్రమోషన్స్ లో వింటూనే ఉంటాం.

    సినిమాపై హైప్ పెంచడానికి అలా మాట్లాడుతుంటారు. ఇది పెద్ద తప్పేం కాదులే. కానీ, కంగువా ప్రమోషన్స్ లో KE జ్ఞానవేల్ రాజా హైప్ ను సంపాదించిపెట్టలేదు. ఏకంగా ఓవర్ హైప్ ను తెచ్చాయి. ఆయన వ్యాఖ్యల వలనే ఈ సినిమా మరింత ట్రోలింగ్ కు గురి అయింది అంటున్నారు సినిమా విశ్లేషకులు. అంతగా ఏమన్నాడు.. ? అని ఆలోచిస్తున్నారా.. ? సరే అది కూడా తెలుసుకోండి. ఒక ఇంటర్వ్యూలో సూర్య కంగువా ఎలా ఉండబోతుంది అంటే.. రూ. 2000 కోట్లు రికార్డ్ లు కొల్లగొడుతుందని చెప్పుకొచ్చాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలే అంత సాధించలేదు. ఇది అంతకుమించి సాధిస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఎక్కువ అంచనాలను పెట్టుకున్నారు.

    ఇక ఇంకోపక్క సూర్య సైతం.. నిర్మాత రూ. 2000 కోట్లు రాబడుతుంది అన్నాడు.. మీరేమంటారు అని అడిగితే.. కలలు కనడం తప్పుకాదు కదా అని ఒకే ఒక్క డైలాగ్ అనేసి ఇంకా సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇంతమంది ఈ రేంజ్ లో హైప్ ఇస్తే.. సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో అని మైండ్ నిండా అంచనాలను పెట్టుకొని థియేటర్ లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన ప్రేక్షకుడు ఉసూరుమంటూ బయటకు వచ్చాడు.

    సూర్యలాంటి స్టార్ హీరోతో శివ క్రింజ్ కామెడీ చేయించాడు. యాక్టింగ్ అంటే సూర్య.. సూర్య అంటే యాక్టింగ్.. అలాంటి హీరోతో ఓవర్ యాక్షన్ చేయించాడు. మొదట 20 నిమిషాలు అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు అదంతా పెట్టాడో తెలియదు. ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అని ఫ్యాన్స్ ను ఎదురుచూసేలా చేశాడు. సరే సెకండాఫ్ బావుందా అంటే లాగ్ ఎక్కువ.. కథ తక్కువ అంటున్నారు నెటిజన్లు. ఇక సూర్య అరుపులు తప్ప ఏమి లేవని కొట్టిపారేస్తున్నారు కూడా.