Bigg Boss Telugu 8: ఈ సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు అని మనకి అనిపించడానికి ప్రధాన కారణాలలో ఒకరు అక్కినేని నాగార్జున. ఇప్పటి వరకు ఆయన ఓటీటీ వెర్షన్ తో కలిపి 7 సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించాడు. ఏ సీజన్ లో కూడా ఆయన ఇంత చెత్త హోస్టింగ్ అయితే చేయలేదు. కోర్టు లో జడ్జి లాగా అలోచించి అందరితో సమన్యాయంతో ఆయన తీర్పులు ఇవ్వాలి కానీ, ఈ సీజన్ లో మాత్రం కేవలం కొంతమంది కంటెస్టెంట్స్ కి డిఫెన్స్ లాయర్ లాగా వ్యవహరించినట్టు చూసే ఆడియన్స్ కి అనిపించింది. ముఖ్యంగా నిఖిల్, గౌతమ్ విషయం లో ఆయన ఎక్కువగా నిఖిల్ వైపే నిలబడి మాట్లాడుతూ వచ్చాడు. ఒక వారంలో ఇద్దరు సమానమైన తప్పులు చేసినప్పుడు నాగార్జున గౌతమ్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఎక్కువగా హైలైట్ చేసేవాడు కానీ, నిఖిల్ చేసిన తప్పులకు మాత్రం చాలా సింపుల్ గా షుగర్ కోటింగ్ ఇచ్చి వదిలేసేవాడు.
నిన్న కూడా అదే జరిగింది. ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో నిఖిల్, గౌతమ్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నిఖిల్ ముందుగా గౌతమ్ క్యారక్టర్ పై బ్లాక్ మార్క్ వేసేలా కొన్ని కామెంట్స్ చేసాడు. ఆ తర్వాత గౌతమ్ అదుపుతప్పి నువ్వు యష్మీ ని వాడుకున్నావ్ అని అంటాడు. ఆ తర్వాత నిఖిల్ పై మూసుకొని కూర్చో అని అంటాడు. ఈ రెండు కామెంట్స్ గౌతమ్ చేయడం తప్పే, దానికి నాగార్జున అతన్ని మందలించడం కూడా కరెక్టే. కానీ తాను తప్పు చేసానని గౌతమే ఒప్పుకున్నప్పుడు అంతసేపు అతన్ని హైలైట్ చేసి, వీడియోలు వేసి కోటింగ్ ఇవ్వడం ఎందుకు అనే భావన చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. గౌతమ్ చేసిన తప్పులే, నిఖిల్ కూడా ఈ వారం చివరి టాస్కులో చేసాడు. కానీ నిఖిల్ ని మాత్రం ఆ తప్పుల నుండి కాపాడే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా అనిపించింది.
ఫిజికల్ టాస్కులు పెట్టినప్పుడు దెబ్బలు తగలడం సహజం. ఎవ్వరూ కూడా కావాలని కొట్టాలని అనుకోరు. కానీ నిఖిల్ మాత్రం గౌతమ్ తనని ఉద్దేశపూర్వకంగానే కొట్టాడు అని ఒక నింద వేసాడు. ఆ పాయింట్ మీదనే పెద్ద గొడవ పెట్టుకున్నాడు. అంతే కాకుండా నిన్న నాగార్జున అడిగినప్పుడు ‘నేను గౌతమ్ కొట్టాడని చెప్పలేదు సార్’ అని అంటాడు. నాగార్జున వీళ్లిద్దరు ఆడిన వీడియో ని చూపించి గౌతమ్ ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని నిరూపించాడు, అంత వరకు బాగానే ఉంది. కానీ నిఖిల్ వేసిన నింద గురించి కూడా వీడియో చూపించి , నువ్వు ఇప్పుడెందుకు అబద్దం చెప్తున్నావ్?, సేఫ్ గా నువ్వేమి తప్పు చేయలేదు అన్నట్టుగా ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావ్? అని అనలేకపోయాడు?, ఇదే తప్పు గౌతమ్ చేస్తే నాగార్జున ఊరుకునే వాడా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు