Samantha: సమంత బాడీ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అందంలోనూ అమ్మడు బోల్డ్ ఫోజులు ఇవ్వడంలోనూ బాగా అరితేరిపోయింది. అయినా ఎన్ని బోల్డ్ ఫోజులు ఇవ్వకపోతే సామ్ ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. అయితే, ఆమె ఎక్స్ పోజింగ్ పై తాజాగా నెటిజన్లు మరోసారి ఫైరయ్యారు. తాజాగా బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్ లో ప్రకటనలో సామ్ మరీ శృతి మించిపోయిందని అంటున్నారు.

ఈ ప్రకటనలో సమంత తన హాట్ డోస్ ను పెంచి.. మునుపెన్నడూ కనిపించని విధంగా పిచ్చెక్కిచేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు అక్కినేని ఫ్యామిలీకి లేని తలనొప్పులు తెస్తుందని మండిపడుతున్నారు. మొత్తానికి సామ్ తన అందాల ప్రదర్శనతో అందరికీ షాక్ ఇచ్చింది. అసలు చూడటానికి సన్నగా.. నాజూగ్గా కనిపించే సమంత రోజురోజుకు బరితెగిస్తోంది అంటున్నారు.
అన్నట్టు హీరోయిన్ గా సమంత ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడాకుల వ్యవహారం, అలాగే సామ్ ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది. ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే.
ఏది ఏమైనా తన జీవితంలో వచ్చిన అనేక ఇబ్బందులకు సంబంధించి ఆమె రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. ‘మీతో మీరు మీలో మీరు నిజాయితీగా ఉండండి’ అంటూ ఓ భావోద్వేగమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత ఈ సందేశాన్ని ఎందుకు పోస్ట్ చేసిందా అని ఆరా తీస్తే చైతుని ఉద్దేశించే పోస్ట్ చేసిందని తెలిసింది.

కాగా 2021 సంవత్సరం సమంతకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం. అందుకే, పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బాధలన్నిటినీ మర్చిపోయింది. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా. కాబట్టి వదిలేసింది. ఊరికినే వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే, తన ఇన్ స్టా అకౌంట్ లో తన బలం ఏమిటో చూపిస్తూ ఇలా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తోందేమో.