Neha Shetty overdose treat viral on social media
Neha Shetty: మెహబూబా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నేహా శెట్టి. ఈ కన్నడ భామకు మెహబూబా రెండో చిత్రం. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి(Akash puri) హీరోగా నటించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి నిర్మించాడు. చాలా అంచనాల మధ్య విడుదలైన మెహబూబా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం సందీప్ కిషన్ కి జంటగా గల్లీ రౌడీ చిత్రం చేసింది. గల్లీ రౌడీ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా డీజే టిల్లు చిత్రంతో నేహా శెట్టికి భారీ హిట్ పడింది.
సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా తెరకెక్కిన క్రైమ్ కామెడీ డ్రామా యువతకు తెగ నచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు వసూళ్ల వర్షం కురిపించింది. నేహా శెట్టి చేసిన రాధిక పాత్ర జనాల గుండెల్లో నిలిచిపోయింది. నేహా శెట్టి కంటే కూడా రాధిక గానే ఆమెకు గుర్తింపు ఉంది. ఇక డీజే టిల్లుకు కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ సైతం భారీ విజయం అందుకుంది. ఈ ఏడాది విడుదలైన టిల్లు స్క్వేర్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
Also Read: Love Mouli: ఆర్ ఆర్ ఆర్ స్టోరీకి ‘‘లవ్ మౌళి’’ సినిమా డైరెక్టర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?
టిల్లు స్క్వేర్(Tillu Square) మూవీలో సిద్ధూ జొన్నలగడ్డకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. నేహా శెట్టి గెస్ట్ రోల్ చేసింది. చివర్లో తళుక్కున మెరుస్తుంది నేహా శెట్టి. కాగా ఆమె లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ కి జంటగా నటించింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదారి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు మాత్రం పర్లేదు. విశ్వక్ సేన్ కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రూపంలో హిట్ పడిందని అంటున్నారు.
Also Read: Anasuya: వయసులో అనసూయ ఎలా ఉండేదో తెలుసా… సంచలన ఫోటోలు వైరల్
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అంజలి మరొక హీరోయిన్ గా నటించింది. నేహా శెట్టి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అధికారికంగా నేహా శెట్టి ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం అల్లాడిస్తుంది. తాజాగా చీరలో మెస్మరైజ్ చేసింది అమ్మడు. ఆమెలోని గ్లామర్ యాంగిల్ గుండెల్లో గుబులు రేపేదిగా ఉంది. నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
Web Title: Neha shetty overdose treat viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com