Balakrishna: ఆరు పదుల వయసులో శరవేగంగా సినిమాలు చేస్తున్నాడు బాలకృష్ణ. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను ఆరు నెలల్లో కంప్లీట్ చేశాడు. వీరసింహారెడ్డి విడుదలైన తొమ్మిది నెలలకు భగవంత్ కేసరి బరిలో దిగనుంది. దసరా కానుకగా ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుంది. ఇక బాలయ్య 109వ చిత్రం దర్శకుడు బాబీతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రకటన పోస్టర్ ఆసక్తి రేపింది. ఆయుధాలు, డబ్బు, చుట్టలు, మ్యాన్షన్ హౌస్ బాటిల్ తో కూడిన ఓ పురాతన బాక్స్ రివీల్ చేశారు.
ఆ వస్తువులు హీరో క్యారెక్టరైజేషన్ తెలియజేస్తున్నాయి. హీరో రూత్ లెస్ అండ్ డేరింగ్ కిల్లర్ కావచ్చు. బాలకృష్ణ బర్త్ డే జూన్ 10న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక బాలయ్య గురించి తెలిసిందే. అనుకున్నదే తడవుగా మూవీ పూర్తి చేయాలి. దర్శకుడు బాబీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశారట. షూటింగ్ కి సర్వం సిద్ధం అంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట.
సారథి స్టూడియోలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారట. సదరు సెట్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఫస్ట్ షెడ్యూల్ లో బాలయ్య రౌడీలను దుమ్మురేపనున్నాడట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. షూటింగ్ మొదలైతే బాలయ్య పరుగులు పెట్టిస్తారు. కాబట్టి బాలయ్య-బాబీ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దిగే అవకాశం ఉంది. బాబీ వాల్తేరు వీరయ్య మూవీతో భారీ హిట్ కొట్టాడు. కెరీర్ బెస్ట్ మూవీ నమోదు చేశాడు.
ఈ క్రమంలో బాలయ్య-బాబీ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు. భగవంత్ కేసరి దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. విడుదలైన భగవంత్ కేసరి టీజర్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలు విజయం సాధించిన నేపథ్యంలో భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ పై కన్నేశాడు.