Nazriya Nazim : చూడడానికి అమాయకంగా చాలా ముద్దుగా కనిపించే ఈ క్యూట్ హీరోయిన్ చిన్నప్పుడు ఇలా ఉండేదని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. అప్పుడు ఎంతో బాగుందని.. ఇప్పుడు అంతకుమించిన అందంతో ఉందని కితాబిస్తున్నారు.

‘రాజారాణి’, బెంగళూరు డేస్ వంటి సినిమాలలో హీరోయిన్ గా చేసిన నజ్రియా నజీమ్ అంటే అందరికీ తెలిసిందే. రాజారాణి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నజ్రియా నజీమ్ ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా చాలా వాటిని డేట్స్ కుదరక, కథ నచ్చ వదలుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది.
Also Read: S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు
దీంతో తెలుగులో ఈమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. ప్రస్తుతం నజ్రియా నజీమ్ తెలుగులో ‘అంటే సుందరానికి’ అనే చిత్రంలో నటిస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులలో రెట్టింపు అంచనాలను కలుగజేసేలా ఉంది. ఈ చిత్రంలో నజ్రియా నేచురల్ స్టార్ నానికి జోడిగా నటించడం జరిగింది.

జూన్ 10న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం కొరకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల చాలా మంది స్టార్ హీరోయిన్ల చిన్న నాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్అయిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో ఎంతో క్యూట్ గా బొద్దుగా ఉన్న నజ్రియా నజీమ్ చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో నజ్రియా చాలా క్యూట్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో విలన్ గా నటించిన ఫహద్ ఫాసిల్ నజ్రియా నజీమ్ భర్త అని అందరికీ తెలిసిందే. పుష్ప మొదటి భాగంలో ఫహద్ ఫాసిల్ పాత్ర అంతగా లేకపోయినా పుష్ప రెండో భాగంలో ఈ పాత్ర కీలకం కానుంది.
Also Read: Vijayendra Prasad: ‘మహేష్ – రాజమౌళి’ పై విజయేంద్రప్రసాద్ క్రేజీ కామెంట్స్