Nayeem Diaries Review: ‘నయూం డైరీస్’ మూవీ రివ్యూ.. గెలిచాడా.. ఓడిపోయాడా?

Nayeem Diaries Review: ‘కిల్లింగ్ వీరప్పన్’ ఫేమ్ దాము బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘నయూం డైరీస్’. వివాదాస్పద గ్యాంగ్ స్టర్ నయూం జీవితాధారంగా దర్శకుడు దాము ‘నయూం డైరీస్’ను ఆద్యంతం సస్సెన్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీని తీర్చిదిద్దాడు. పేదల కోసం నక్సలైట్ గా మారిన నయూం చివరకు వారికే వ్యతిరేకంగా గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు? పోలీసుల చేతిలో నయూం అసాంఘిక శక్తిగా ఎలా మారడనేదే సినిమా కథ. రియల్ స్టోరీ ఆధారంగా […]

Written By: NARESH, Updated On : December 10, 2021 12:18 pm
Follow us on

Nayeem Diaries Review: ‘కిల్లింగ్ వీరప్పన్’ ఫేమ్ దాము బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘నయూం డైరీస్’. వివాదాస్పద గ్యాంగ్ స్టర్ నయూం జీవితాధారంగా దర్శకుడు దాము ‘నయూం డైరీస్’ను ఆద్యంతం సస్సెన్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీని తీర్చిదిద్దాడు. పేదల కోసం నక్సలైట్ గా మారిన నయూం చివరకు వారికే వ్యతిరేకంగా గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు? పోలీసుల చేతిలో నయూం అసాంఘిక శక్తిగా ఎలా మారడనేదే సినిమా కథ.

nayeem dairees

రియల్ స్టోరీ ఆధారంగా ‘నయూం డైరీస్’ తెరకెక్కిడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. నయూం పాత్రను దర్శకుడు సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు. కేజీఎఫ్, నారప్ప చిత్రాలతో ఆకట్టుకొన్న వశిష్ట సింహ ఈ మూవీలో నయీంగా నటించాడు. నయూం ప్రాతకు దర్శకుడు దాము, హీర వశిష్ట ఏమేరకు న్యాయం చేశారో తెలియాలంటే మాత్రం తప్పకుండా సినిమా చూడాల్సిందే.

సినిమా కథ విషయానికొస్తే.. భువనగిరి ప్రాంతానికి చెందిన నయీం చిన్నతనంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడు అవుతాడు. పేదలకు సాయం చేయాలనే తపనతో మావోయిస్టుగా మారిపోతాడు. మావోయిస్టు దళంలో నిస్వార్ధంగా పని చేయడంతో కొద్దిరోజుల్లో నక్సలైట్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా మారిపోతాడు. ఉద్యమంలో భాగంగానే వ్యాస్ హత్య కేసులో నయూం జైలుకు వెళ్లాల్సి వస్తోంది.

అక్కడ అతడికి ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే సోదరికి ఎదురైన  చేదు అనుభవాలు.. సోదరుడి మరణ వార్తలు నయూం ఆలోచనలను పూర్తి మార్చివేస్తాయి. ఈక్రమంలోనే నయీం పోలీసుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోవడం లాంటి సంఘటనలను దర్శకుడు చక్కగా చూపించాడు.

నయూం జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన దర్శకుడు సినిమాటిక్ గా మాత్రం కొంత తడబడినట్లు కన్పింది. నయీంకు తెరవెనుక జీవితం ఇలా ఉందా అని చెప్పడంలో ఆసక్తిని కలిగించాడు. జైలులో మావోయిస్టుల జీవితాలు ఎలా ఉంటాయి..? జైలు నుంచి వారి వ్యూహాలు ఎలా ఉంటాయి? వారిలో స్వార్థం, లోపాలు ఎలా ఉంటాయనేది చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు.

సెకండ్ ఆఫ్ లో మావోయిస్టులపై నయీం తిరుగబాటు.. ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపిన విధానం.. రాజకీయ నేతలకు ధమ్కీలు లాంటి అభిమానులు ఆకట్టుకునే చూపించాడు. బెల్లి లలిత హత్యకు గల కారణాలు, నయీం సోదరుడి మర్డర్‌కు సంబంధించిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఉద్యమ పార్టీ నేతను నయీం బెదిరించడం లాంటివి ఆకట్టుకుంటాయి.

Also Read: ‘భీమ్లా నాయక్’ రన్ టైమ్ ఫిక్స్… ఆ సీన్స్ తీసేశారు !

నయీం పాత్రలో వశిష్ట సింహ ఒదిగిపోయారు. నక్సలైట్ ఉద్యమంలో నిజాయితీ పరుడిగా, అలాగే మావోయిస్టులకు వ్యతిరేకంగా అసాంఘీక శక్తిగా విలక్షణ నటనను ప్రదర్శించాడు. ఈ చిత్రంలో నయీం సోదరిగా యజ్ఞాశెట్టి గ్లామర్, నటన ఆకట్టుకుంటుంది. నయీం భార్యగా బిగ్‌బాస్ దివి వద్యా గ్లామర్‌, రొమాంటిక్ సన్నివేశాలను పండిచింది. బెల్లి లలితగా సంయుక్త ఆకట్టుకుంది.

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సీన్లను భార్గవ సురేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రభాకర్ అరుణ్ మ్యూజిక్, కిషోర్ మద్దాలి ఎడిటింగ్  బాగున్నాయి. పద్మారెడ్డి, వరదరాజుల నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో డైలాగ్ పార్ట్ ఎక్కువై విజువల్ ప్రజెంటెషన్ తక్కువైందనే ఫీల్ కలుగుతుంది. అయితే క్రైమ్ డ్రామాను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఫీల్ ను ఇస్తుంది.

Also Read: “జై బాలయ్య” అంటూ అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసిన హీరోయిన్ పూర్ణ