‘కరోనా మహమ్మారి’ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్ బాట పట్టారు. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నుండి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకూ సెకండ్ డోస్ వాక్సిన్ తీసుకుని ప్రజలకు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సందేశం ఇచ్చారు. ఇక తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే క్రేజీ ప్రేమ జంట ‘నయనతార – విఘ్నేష్ శివన్’ కూడా వ్యాక్సిన్ వేయించుకుని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిపోతోన్న నయనతార, గత కొన్ని సంవత్సరాలుగా విఘ్నేష్ శివన్ ప్రేమలో మునికి తేలుతూ నానిపోతూ ఉంది. దాంతో ఈ జంట పెళ్లి పై పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా నయనతారకు కూడా ఈ పుకార్లు బాగా అలవాటు అయిపోయినట్లు ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితంలోని ప్రేమ కథల గురించి కథలుకథలుగా రాస్తూనే ఉన్నా
నయనతార మాత్రం వాటిని ఖండించడానికి కూడా ఆసక్తి చూపించలేదు. పోనీ, పెళ్లి అయినా చేసుకుంటుందా అంటే అది లేదు. ఎన్ని పుకార్లు వచ్చినా, ఎన్నిసార్లు వైరల్ అవుతున్నా నయనతార మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా గత ఆరేళ్లుగా విఘ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తూ.. పబ్లిక్ గానే తానేంటో చాటి చెప్పింది. అయితే, ఏ క్షణానైనా ఈ జంట పెళ్లి చేసుకుంటుందంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికైనా తన పెళ్లి పై వస్తోన్న అనేక ఊహాగానాలుకు నయనతార ఫుల్ స్టాప్ పెట్టాలి. తన పై అడ్డు అదుపు లేకుండా వస్తోన్న అనేక విమర్శలకు ఆమె స్వస్తి పలకాలి. కనీసం ఈ సమ్మర్ టైమ్ లోనైనా పెళ్లి చేసుకోని నయనతార సెటిల్ అయితే బాగుండు అని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.