Nayanthara- Vignesh: షాకింగ్.. నయనతార – విఘ్నేశ్ పెళ్ళికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదా..!

Nayanthara- Vignesh: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన ప్రియుడు విఘ్నేష్ ని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..ఖరీదైన బట్టలు మరియు నగలతో పెళ్లికూతురు అవతారం లో కనిపించిన నయనతార ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి..ఈ జంట పెళ్లి వేడుక మొత్తం ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలోనే జరిగిందట..తొలుత వీళ్లిద్దరు తిరుమల లో శ్రీవారి సన్నిధిలో ఘనం గా పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా […]

Written By: Neelambaram, Updated On : June 17, 2022 7:11 pm
Follow us on

Nayanthara- Vignesh: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన ప్రియుడు విఘ్నేష్ ని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..ఖరీదైన బట్టలు మరియు నగలతో పెళ్లికూతురు అవతారం లో కనిపించిన నయనతార ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి..ఈ జంట పెళ్లి వేడుక మొత్తం ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలోనే జరిగిందట..తొలుత వీళ్లిద్దరు తిరుమల లో శ్రీవారి సన్నిధిలో ఘనం గా పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అక్కడ కుదరక మహాబలిపురం లోని ఒక్క ప్రముఖ రిసార్ట్ లో జరుపుకున్నారు..ఈ వివాహ మహోత్సవానికి సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులతో పాటుగా నయనతార మరియు విఘ్నేష్ కి సంబంధించిన మిత్రులు సన్నిహితులు కూడా హాజరు అయ్యారు..పెళ్లి ఎంతో ఘనంగా..రిచ్ గా..సౌత్ లో ఇటీవల కాలం లో ఏ సెలబ్రిటీ కూడా జరుపుకొనేంత అంగరంగ వైభవం గా జరుపుకున్నారు..పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ‘ఏర్పాట్లు అన్ని అదిరిపోయాయి..ఎంత ఖర్చు చేసుంటారో’ అని కూడా అనుకున్నారట..కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ పెళ్లి కి అటు నయనతార కానీ..ఇటు విఘ్నేష్ కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదట.

Vignesh, Nayanthara

Also Read: Kamal Haasan: చాలా రోజుల తర్వాత కడుపునిండా అన్నం తింటున్నాను – కమల్ హాసన్

వాళ్లిదరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా అంత ఘనంగా పెళ్లి ఎలా చేసుకున్నారు అనే సందేహం మీ అందరిలో రావడం సహజం..కానీ అదే నిజం..వీళ్లిద్దరి పెళ్లి ఖర్చుని మొత్తం ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ భరించిందట..దాదాపుగా ఈ పెళ్లి కోసం వారు పాతిక కోట్ల రూపాయిలు ఖర్చు చేసుంటారు అని సమాచారం..పెళ్లి వీడియో మొత్తం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసుకునేందుకే నెట్ ఫ్లిక్స్ వారు ఈ డీల్ తో నయనతార – విఘ్నేష్ ముందుకి వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త..అందుకే వీళ్ళ పెళ్ళికి సంబంధించి కొన్ని ఫోటోలు మినహా ఒక్క వీడియో కూడా బయటకి రాలేదు అని అంటున్నారు..త్వరలోనే వీళ్లిద్దరి వివాహ మహోత్సవం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది..అభిమానులందరూ ఈ వీడియో కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Nayan, Vignesh

Also Read: Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా ఆమె.. చిరంజీవి చేతులమీదుగా ట్రోఫీ!

Tags