https://oktelugu.com/

Nayantara Remuneration: జవాన్ సక్సెస్… చుక్కల్లో నయనతార రెమ్యునరేషన్, అన్ని కోట్లు అడుగుతుందా!

నిజానికి హీరోయిన్ కెరీర్ స్పామ్ అనేది చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ నయనతార దాదాపు 40 ఇయర్స్ దగ్గరికి వచ్చిన కానీ వన్నె తగ్గని అందంతో ఇప్పటికి కూడా ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన నటిస్తూ మెప్పిస్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : September 14, 2023 / 02:53 PM IST

    Nayantara Remuneration

    Follow us on

    Nayantara Remuneration: సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 2 దశాబ్దాలు అవుతున్నా కానీ ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోగా రోజు రోజుకు తన రేంజ్ పెంచుకుంటూ అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది. 2005 లో అయ్యా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 2006 లో లక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మొదలు ఇప్పటివరకు వెనుతిరిగి చూడలేదు.

    నిజానికి హీరోయిన్ కెరీర్ స్పామ్ అనేది చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ నయనతార దాదాపు 40 ఇయర్స్ దగ్గరికి వచ్చిన కానీ వన్నె తగ్గని అందంతో ఇప్పటికి కూడా ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన నటిస్తూ మెప్పిస్తుంది. తాజాగా షారుఖ్ ఖాన్ సరసన నటించిన జవాన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా నయనతార కు మంచి పేరు తీసుకుని రావడమే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె పేరు బాగానే వినపడేలా చేసింది.

    తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు కూడా బాలీవుడ్ మార్కెట్ అనేది ఏర్పడింది. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సౌత్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార మరోసారి రేట్ పెంచిందని సినీ వర్గాల్లో గుసగుసలు మొదలైయ్యాయి. జవాన్ సినిమా కు 8 కోట్ల పుచ్చుకున్న ఈ అమ్మడు, తన తర్వాత సినిమాలకు 10 కోట్లు దాకా కోడ్ చేసినట్లు తెలుస్తోంది.

    మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న కొత్త సినిమా లో నయనతారను హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు చేశాయి. దీనితో మరోసారి మెగాస్టార్ పక్కన నయనతారను ఫైనల్ చేశారు. ఈ సినిమాకు ఆమె దాదాపు 10 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కథ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా నయనతార కు ఆ స్థాయి అమౌంట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే తమిళనాడు లో ఎంతోకొంత సినిమా బిజినెస్ పరంగా ఆమె ప్లస్ అవుతుంది.