Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో 100% సక్సెస్ రేట్ ని సాధించడం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే దర్శకులు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో కొన్నిసార్లు కొన్ని క్యాలిక్యులేషన్స్ తప్పుతూ ఉంటారు. దాని వల్ల సినిమా తేడా కొడుతుంది. ఇప్పటివరకు రాజమౌళి చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయి. తన తర్వాత ఆ ఘనతను సాధించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… ప్రస్తుత 9 విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి మరోసారి మరో హీరోతో జతకట్టడానికి సిద్ధమవుతున్నాడు…ఇక ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకులను మాత్రమే చూశాం. ఇక హీరోల్లో మాత్రం 100% సక్సెస్ రేట్ ను మెయిటైన్ చేయడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఒక సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే మరొక సినిమాతో డీలా పడిపోవచ్చు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళ కెరియర్లో డిజాస్టర్ సినిమాలను చేసినవారే కావడం విశేషం…ప్రస్తుతం యంగ్ హీరోగా మంచి గుర్తింపు ను సంపాదించుకుంటున్న నవీన్ పోలిశెట్టి మాత్రం ఇప్పటివరకు చేసినవి నాలుగు సినిమాలైనప్పటికి ఆ నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి…
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో హీరోగా తన కెరియర్ ను మొదలు పెట్టిన నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలను చేశాడు. ఈ మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఇక ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయినప్పటికి మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది.
ఈ సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందంటూ ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక తన తోటి హీరోలు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే నవీన్ పోలిశెట్టి మాత్రం సినిమాలను ఎక్కువగా చేయడం కంటే సక్సెస్ రేట్ ను పెంచుకోవడం ఉత్తమం అంటున్నాడు…
అందుకే ఆయన ఒక సినిమాని చేసేటప్పుడు ఆ సినిమాని ఒకటి పది సార్లు ఆలోచించి మరి చేస్తుంటాడు. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సైతం సినిమా ఎలా వస్తుంది అనేది దర్శకుడు తో పాటు చర్చిస్తూ ఉంటారట. ప్రస్తుతం అతనికి నాలుగు విజయాలతో వరించాయి. తన తదుపరి సినిమాలతో సక్సెస్ ని సాధిస్తూ ఇలాగే 100% సక్సెస్ రేట్ ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…