Natural Star Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు నాని… అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వాత వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన మంచి విజయాలను సాధిస్తూ ఇప్పుడున్న హీరోలందరి కంటే కూడా ఒక సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మాస్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నాని(Nani) స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందడుగులు వేస్తున్నాడు. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు రావడమే కాకుండా తను కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ కొత్త దర్శకులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సైతం సుజిత్ డైరెక్షన్ లో ఓజి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ బిజినెస్.. ఆంధ్ర హక్కులు ఎంతంటే!
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి ఎలాగైనా సరే తనను తాను స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని పాన్ ఇండియాలో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఈ సినిమా లేట్ అవుతున్న కొద్ది డైరెక్టర్ సుజిత్ వేచి చూడడం ఇష్టం లేక మధ్యలో నానితో ఒక సినిమా అయితే స్టార్ట్ చేశాడు.
ఆ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక రీసెంట్ గా హిట్ 3 సినిమా చేస్తున్న నాని ఆ సినిమా మే ఒకటోవ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ఆ ఇంటర్వ్యూ లో సుజిత్ నాని సినిమా ఎందుకు ఆగిపోయింది అనే విషయం మీద నాని ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ తో సుజిత్ చేస్తున్న ఓజి (OG) సినిమా తొందరగా ఫినిష్ అయిపోతే ఆ తర్వాత మా సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో మా ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టాము. అంతేతప్ప ప్రాజెక్టు ఆగిపోలేదు అనే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓ జి సినిమా పూర్తవుతుంది. అప్పుడు నాని గ్యాంగ్ స్టర్ గా అవతారం ఎత్తుతాడు. ఇది ఎంత తొందరైతే నాని ప్రాజెక్ట్ అంత తొందరగా సెట్స్ మీదకి వస్తుంది. మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read ;పవన్ కళ్యాణ్ ఆలస్యం వల్లే ‘హిట్ 3’ చిత్రం తీసాము – హీరో నాని