Hero Nani: ‘ఎఫ్2’ సినిమాను హీరో నాని ఎందుకు వదులుకున్నాడంటే?

Hero Nani: సహజత్వానికి దగ్గరిగా ఉండే పాత్రలు చేస్తూ నేచురల్ స్టార్ గా ఎదిగాడు హీరో నాని. నటుడిగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమ, కుటుంబ కథా చిత్రాల హీరోగా స్థిరపడ్డాడు. నానిని చూస్తే మన పక్కింటి అబ్బాయిని చూసినట్టుగా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా నటిస్తుంటాడు. తరచూ ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించే హీరో నాని కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘టక్ జగదీశ్’. తెలుగింటి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు […]

Written By: NARESH, Updated On : September 9, 2021 7:09 pm
Follow us on

Hero Nani: సహజత్వానికి దగ్గరిగా ఉండే పాత్రలు చేస్తూ నేచురల్ స్టార్ గా ఎదిగాడు హీరో నాని. నటుడిగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమ, కుటుంబ కథా చిత్రాల హీరోగా స్థిరపడ్డాడు. నానిని చూస్తే మన పక్కింటి అబ్బాయిని చూసినట్టుగా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా నటిస్తుంటాడు.

తరచూ ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించే హీరో నాని కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘టక్ జగదీశ్’. తెలుగింటి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ‘టక్ జగదీష్’ ప్రమోషన్స్ లో భాగంగా నాని విలేకరుల సమావేశంలో ముచ్చటించారు.

దసరాకు అందరికీ షాకిచ్చేలా ఓ విభిన్నమైన సినిమా చేస్తున్నానని.. దాని ఫస్ట్ లుక్ చూసి అందరూ షాక్ అవుతారని సీక్రెట్ మెయింటేన్ చేశాడు హీరో నాని. ఈ క్రమంలోనే తాను రెండు పెద్ద హిట్ సినిమాలు మిస్ అయ్యానన్న సంగతిని నాని బయటపెట్టాడు.

అట్లీ దర్శకత్వం వహించిన ‘రాజా రాణి’ సినిమా మొదట ఆఫర్ నాకే వచ్చిందని నాని గుర్తు చేసుకున్నాడు. సినిమా కథ నాకు బాగా నచ్చిందని.. సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని నాకు అర్థమైందని.. కానీ ఆ సమయంలోనే నా చేతిలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘పైసా’ సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉండడంతో వీలు కాలేదని నాని అన్నారు. దానివల్ల నిర్మాతతో మాట్లాడి నేనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలిపారు.

ఇక టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఎఫ్2’ సినిమాకు హీరోగా నన్ను అడిగారని.. కానీ ఆ సినిమా కూడా వేరే షూటింగ్స్ వల్ల వదులుకున్నానని నాని గుర్తు చేసుకున్నాడు. నాకు రిమేక్స్ చేయాలని లేదని.. వాటి జోలికి పోను అని నాని స్పష్టం చేశాడు.