Nari Nari Naduma Murari Collection: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన శర్వానంద్(Sharwanand), రీసెంట్ గా సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari Movie) చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి పండుగ సెలవుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసి లాభాల్లోకి అడుగుపెట్టింది. కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. కానీ ఓవరాల్ గా ఈ సంక్రాంతికి బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిల్చింది ఈ సినిమా. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. 7వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 47 లక్షలు, వరల్డ్ వైడ్ గా 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 45 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 85 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 4 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 16 లక్షల రుపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 16 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి 2 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 12 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రానికి విడుదలకు ముందు 10 కోట్ల 25 లక్షల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు రెండున్నర కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి క్లోజింగ్ లో 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు సాయంత్రం నుండి వీకెండ్ మొదలు అవుతుంది. సోమవారం కూడా నేషనల్ హాలిడే అవ్వడం తో ఈ చిత్రం బయ్యర్స్ కి మరింత లాభాలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. త్వరలోనే హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ సక్సెస్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు మేకర్స్.