Nari Nari Naduma Murari 5 Days Collections: ఈ సంక్రాంతికి ట్రేడ్ ని సప్రైజ్ కి గురి చేసిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి రేస్ లో చివరిగా వచ్చిన సినిమా, హీరో శర్వానంద్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు, నిర్మాత ‘అఖండ 2’ చిత్రం ఫ్లాప్ తో భారీ ఆర్ధిక నష్టాల్లో ఉన్నాడు, అందుకే ఈ చిత్రానికి అతి తక్కువ షోస్ కేటాయించారు. కానీ మొదటి షో నుండే ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో పక్క రోజు నుండి షోస్ భారీగా పెంచాల్సి వచ్చింది. అలా 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి, నేడు లాభాల్లోకి అడుగుపెట్టింది. శర్వానంద్ సంక్రాంతికి వస్తే హిట్టు కొట్టి తీరుతాడు అనే సెంటిమెంట్ ని మరోసారి నిజం చేసి చూపించింది ఈ చిత్రం.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ 5 రోజుల థియేట్రికల్ రన్ లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి వివరంగా చూద్దాం. నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 70 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 4 కోట్ల 30 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి మొదటి 5 రోజుల్లో ఈ చిత్రానికి 8 కోట్ల 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 14 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
ఇక ఓవర్సీస్ నుండి అయితే 2 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ వసూళ్లు ఈ ప్రాంతం నుండి నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 11 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 20 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 10 కోట్ల 25 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది . అంటే కోటి రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
