Superstar Krishna Health- Naresh: సూపర్ స్టార్ కృష్ణ సడన్ గా ఆసుపత్రి పాలయ్యారు. గత రాత్రి కృష్ణ గుండెపోటుకు గురయ్యారు . వెంటనే కుటుంబ సభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. క్రిటికల్ కండీషన్ లో ఉన్న కృష్ణకు వైద్యులు సి పి ఆర్ చేశారు. వెంటనే ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. కృష్ణ ఆరోగ్యంపై వైద్యుల కామెంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. కృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యానికి ఆయన శరీరం సహకరిస్తుందో చెప్పలేము. కాబట్టి 24 గంటలు గడిస్తే కానీ స్పష్టత రాదన్నారు. అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు.

వైద్యుల మాటల్లో విశ్వాసం లోపించగా ఆందోళన వ్యక్తం అవుతుంది. కాంటినెంటల్ హాస్పిటల్ విడుదల చేసిన బులిటెన్ లో సైతం నిపుణులైన కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ కృష్ణ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా కృష్ణ ప్రస్తుత కండీషన్ గురించి నరేష్ తెలియజేశారు. మీడియాతో మాట్లాడుతూ… కృష్ణ హెల్త్ కండీషన్ క్రిటికల్ గా ఉన్నప్పటికీ శ్వాస తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రియల్ లైఫ్ లో , రీల్ లైఫ్ లో ఆయన డేరింగ్ డాషింగ్ పర్సన్. కృష్ణకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కాబట్టి ఆయన కచ్చితంగా కోలుకుని తిరిగి వస్తారు.
కృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేయండి. రేపు ఆసుపత్రి వర్గాలు మరో బులెటిన్ విడుదల చేస్తారు. 48 గంటలు గడిస్తే కానీ ఈ విషయం చెప్పలేమని వైద్యులు అన్నారని.. నరేష్ చెప్పుకొచ్చారు. నరేష్ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆత్మవిశ్వాసం నింపాయి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కృష్ణ కోలుకుంటారని నమ్మకం కలిగించాయి.

నెలల వ్యవధిలో కృష్ణ కుటుంబంలో మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో మరణించాడు. సెప్టెంబర్ 28న భార్య ఇందిరాదేవి కన్నుమూశారు. 2019లో రెండో భార్య విజయనిర్మల హఠాన్మరణం పొందారు. కృష్ణ శరీరంలో ఒక భాగం వలె విజయనిర్మల తోడుగా ఉన్నారు. వరుస కుటుంబ సభ్యుల మరణాలు కృష్ణను మానసిక వేదనకు గురి చేసినట్లు సమాచారం. ఇవే కృష్ణ ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయన్న వాదన వినిపిస్తోంది.