Baladitya Remuneration: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైన మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయం ని ఏర్పర్చుకున్న కంటెస్టెంట్ బాలాదిత్య..ప్రతి విషయం లో సోది కొడుతాడు..ప్రవచనాలు ఇస్తుంటాడు అనే ఒక్క నింద తప్ప అతనిపై ఇప్పటి వరుకు ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా రాలేదు..హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ అందివ్వడం లో విఫలం అయ్యినప్పటికీ టాస్కుల విషయం లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ఆడాడు..అందుకే పది వారాలపాటు హౌస్ లో కొనసాగి మొన్న ఎలిమినేట్ అయ్యాడు.

అయితే బాలాదిత్య ఉన్న హౌస్ మేట్స్ అందరిలో ప్రేక్షకులకు బాగా ముఖపరిచయం ఉన్న కంటెస్టెంట్..బాల నటుడిగా ఆయన ఎన్నో సినిమాల్లో నటించి, హీరో గా కూడా పలు సినిమాల్లో రాణించాడు..అంత ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ మాములుగా పారితోషికం బలంగానే ఇస్తాడు అనే పేరుంది..గత సీజన్స్ అన్నిట్లో కూడా కంటెస్టెంట్స్ కి భారీ మొత్తంలోనే డబ్బులు ఇచ్చారు..కానీ బాలాదిత్య విషయం లో మాత్రం అన్యాయం జరిగింది.
హౌస్ లో ఉన్న పది వారాలకు కలిపి ఆయనకీ కేవలం 6 లక్షల 50 వేల రూపాయిలు మాత్రమే పారితోషికంగా ఇచ్చారట..అంటే వారానికి కేవలం 25 వేల రూపాయిలు మాత్రమే బాలాదిత్య కి అందినట్టు..ఆ లెక్కన తీసుకుంటే రోజుకు సగటున మూడున్నర వేల రూపాయిలు బాలాదిత్య పారితోషికం గా చెప్పుకోవచ్చు..ఇది చాలా అంటే చాలా తక్కువ మొత్తం అనే చెప్పాలి..ఎందుకంటే సీరియల్స్ లో నటించే హీరోయిన్స్ సైతం రోజుకి మినిమం 7 వేల రూపాయిల నుండి గరిష్టంగా 25 వేల రూపాయిలు తీసుకుంటున్నారు..అలాంటిది వెండితెర ద్వారా ప్రేక్షకులందరికీ ముఖపరిచయం ఉన్న ఒక టాప్ సెలబ్రిటీ కి కేవలం రోజుకి మూడున్నర వేల రూపాయిలు మాత్రమేనా అని బాలాదిత్య ని అభిమానించే వారు వాపోతున్నారు.

బాలాదిత్య కి ప్రస్తుతం సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ ఎలాంటి అవకాశాలు రావడం లేదు..అందుకే తక్కువ పారితోషికం అయ్యినప్పటికీ కూడా మంచి పాపులారిటీ ని దక్కించుకునే స్కోప్ ఉన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో లో అవకాశం దొరకకగానే ఒక్క క్షణం ఆలోచించకుండా బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది..మరి ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీ బాలాదిత్య లక్ష్యాన్ని రీచ్ అయ్యేలా చేస్తుందా లేదా అనేది చూడాలి.