spot_img
Homeఎంటర్టైన్మెంట్Telugu Singer Sri Lalitha: తెలుగు సింగర్ పాడిన పాటకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమోషన్!

Telugu Singer Sri Lalitha: తెలుగు సింగర్ పాడిన పాటకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమోషన్!

Telugu Singer Sri Lalitha: ఏపీకి చెందిన సింగర్ కు అరుదైన గౌరవం లభించింది. ఆమె పాడిన పాటను ప్రధాని మోదీ ( Prime Minister Narendra Modi)సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. విజయవాడకు చెందిన శ్రీ లలిత దుర్గమ్మ పై ఒక పాట పాడారు. శ్రీ లలితా కనకదుర్గ మహాప్రమావిత అంటూ పాడిన పాట లింకును ప్రధాని షేర్ చేశారు. ప్రధాని ఈ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంది. విజయవాడ సత్యనారాయణ పురానికి చెందిన సింగర్ శ్రీ లలిత ఎన్నో పాటలు పాడారు. ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ పై.. కనకదుర్గ మహాప్రమావిత అంటూ ఒక పాట పాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పాటను విని దానికి సంబంధించిన లింకును సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పోస్ట్ చేయడంతో అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read: నాయకుడంటే ఇలానే ఉండాలనే రీతిలో లోకేష్.. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

* అభినందిస్తూ పోస్ట్..
విజయవాడ దుర్గమ్మ పై అనేక పాటలు వచ్చాయి కానీ… శ్రీ లలిత ( singer Sri Lalitha )పాడిన పాట మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.’ జగదాంబ మాతను ఆరాధిస్తే మనసుకు అంతులేని శక్తి.. బలం నిండిపోతుంది. ఆ మాట మన హృదయాన్ని దైవ చైతన్యంతో ప్రకాశింపజేస్తుంది ‘ అని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే తెలుగు అమ్మాయి శ్రీ లలిత పాడిన పాట కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు దీనిని మరింత వైరల్ చేస్తున్నారు. మరోవైపు విజయవాడ అమ్మాయి పాడిన పాటను ప్రధాని పోస్ట్ చేయడంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడకు చెందిన శ్రీ లలిత పాడిన ఈ పాటను స్వయంగా దేశ ప్రధాని ప్రజలతో పంచుకోవడం నగరవాసులందరికీ గర్వకారణం అని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీమతి లలిత గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ ట్విట్ చేశారు సుజనా చౌదరి.

* తెలుగు పండుగలపై స్పందన..
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మంచి సంస్కృతిని అలవరుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పండగలు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తెలుగులోనే ట్విట్ చేస్తున్నారు. ఇటీవల ఉగాది రోజు కూడా అదే పని చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సంస్కృతిని గుర్తు చేస్తూ ఆయన చేసిన ట్వీట్ అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు సింగర్ శ్రీలలిత విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పనికి తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version