https://oktelugu.com/

Nani – Keerthi Suresh : కుమ్మేసేయ్.. నానిని ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తున్న కీర్తి సురేష్

Nani – Keerthi Suresh : ఇవాళ నాచురల్ స్టార్ నాని 39వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అంతకుముందే దసరా చిత్రం యూనిట్ ఇతడి పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని 39 సినిమా థియేటర్లలో వినూత్నంగా దసరా సినిమాలో నాని కామియోను ప్రదర్శించింది. అక్కడికి వచ్చిన అభిమానులతో హ్యాపీ బర్త్డే టూ యు నాని అని చెప్పించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలామంది నానికి శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు. నాని […]

Written By:
  • Rocky
  • , Updated On : February 24, 2023 / 09:36 PM IST
    Follow us on

    Nani – Keerthi Suresh : ఇవాళ నాచురల్ స్టార్ నాని 39వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అంతకుముందే దసరా చిత్రం యూనిట్ ఇతడి పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని 39 సినిమా థియేటర్లలో వినూత్నంగా దసరా సినిమాలో నాని కామియోను ప్రదర్శించింది. అక్కడికి వచ్చిన అభిమానులతో హ్యాపీ బర్త్డే టూ యు నాని అని చెప్పించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలామంది నానికి శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు. నాని భార్య అంజన సౌమ్య ” 15 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసు.. నీతో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను” అంటూ ఉద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది.

    ధరణి కుమ్మేసేయ్

    ఇక వీరంతా ఒక ఎత్తు అయితే.. నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో కీర్తి సురేష్ మరో ఎత్తు.. నానితో దసరా సినిమా షూటింగ్ స్పాట్లో షటిల్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా షటిల్ ఆడారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందారు. ఇదే సమయంలో నాని ఏదో అంటే కీర్తి సురేష్ చిలిపిగా షటిల్ బ్యాట్ తో కొట్టింది.. అంతేకాదు నాని కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను, దసరా సినిమాలో నాని గెటప్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. కుమ్మేసెయ్ ధరణి అంటూ రాసుకొచ్చింది.

    నీతో అనుబంధం ప్రత్యేకం

    ఇక నానికి కీర్తి సురేష్ వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ” ప్రియమైన స్నేహితుడా నీతో నా అనుబంధం ప్రత్యేకం. నీతో సినిమా గురించి అన్ని విషయాలు చర్చిస్తాను.. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.. హ్యాపీ బర్త్డే టూ యు నాని అంటూ” ఉద్వేగ భరితంగా పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ కు స్పందించిన నెటిజన్లు “ఒక స్నేహితుడికి మరొక స్నేహితురాలు ఇంత కంటే గొప్పగా శుభాకాంక్షలు చెబుతుందా” అని వ్యాఖ్యలు చేస్తున్నారు. నానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.