Nani and Vijay Deverakonda : సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణం అయి పోయింది. ఒకప్పుడు చిరంజీవి(Chiranjeevi),బాలయ్య(Balayya) మధ్య నెంబర్ వన్ పొజిషన్ కోసం భారీగా పోటీ ఉండేది. బాలయ్య చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నప్పటికి చిరంజీవి చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా మిగలడంతో బాలయ్య బాబు కంటే ఒక్క అడుగు ముందు ఉండటంతో చిరంజీవి మెగాస్టార్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కూడా ఎదిగాడు. ఇక ఆ తర్వాత కాలంలో కూడా పవన్ కళ్యాణ్(Pavan Kalayan), మహేష్ బాబు (Mahesh Babu) మధ్య పోటీ అయితే నడిచింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య పోటీ నడుస్తుంది. ఇక స్టార్ హీరోల విషయం పక్కన పెడితే రేంజ్ హీరోల మధ్య కూడా విపరీతమైన పోటీ నడుస్తుందనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. న్యాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటితో తనకంటూ ఒక వైవిధ్యమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
Also Read : నాని ఊర మాస్ సినిమాలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?
ఇక అతనితో పాటుగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో విజయ్ దేవరకొండ (vijay Devarakonda) సైతం ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమాతో భారీ గుర్తింపును తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…మరి ఈ ఇద్దరు హీరోల మధ్య ఇప్పుడు చాలా మంచి పోటీ అయితే నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇద్దరూ ప్రస్తుతం మాస్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నాని సక్సెస్ లో ఉంటే విజయ్ దేవరకొండ మాత్రం ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న కింగ్ డమ్ (King Dam) సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని దృఢ సంకల్పంతో విజయ్ దేవరకొండ ఉండడం విశేషం…
ఇక ప్రస్తుతం నాని సైతం హిట్ 3(Hit 3), ప్యారడైజ్ (Paradaise) సినిమాలతో భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎవరిపైన పనిచేసే సాధిస్తారు. తద్వారా ఎవరు స్టార్ హీరో రేంజ్ ను అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. రాబోయే సినిమాలతో ఇద్దరూ మంచి విజయాలను సాధిస్తే వీళ్ళిద్దరూ సైతం స్టార్ హీరోలుగా ఎదగవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
Also Read : విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి విచిత్రమైన టైటిల్ ని ప్రకటించిన దిల్ రాజు..షాక్ లో ఫ్యాన్స్!