Site icon OkTelugu

Nani Unhappy With Srikanth Odela: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తీరుపై హీరో నాని అసహనం.. ఇది నిజంగా చిరాకు కలిగించే విషయమే..

Nani Unhappy With Srikanth Odela

Nani Unhappy With Srikanth Odela

Nani Unhappy With Srikanth Odela: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) పని తీరుపై నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నాడా?, ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) మూవీ ఔట్పుట్ అనుకున్న స్థాయిలో రావడం లేదా?, ఇలాంటి పుకార్లు ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ అంశం గురించే మాట్లాడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం 50 శాతం మాత్రమే పూర్తి అయ్యిందట. శ్రీకాంత్ బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకోకపోవడం , ఒక సన్నివేశానికి నాలుగైదు వెర్షన్లు రాసి , రీ షూట్స్ మీద రీ షూట్స్ చేయడం వంటివి నాని కి తీవ్రమైన కోపాన్ని రప్పిస్తుందట. ప్లాన్ ప్రకారం ఈ చిత్రం మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఆగస్టు 21 కి వాయిదా వేశారు మేకర్స్.

కానీ ఇప్పుడు ఆ తేదీన రావడం దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు. దసరా కి , లేదంటే డిసెంబర్ నెలలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి నాని కూడా ఒక నిర్మాత అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే బడ్జెట్ లిమిట్ దాటిపోయింది. రీ షూట్స్ కోసం అదనంగా కోట్లు ఖర్చు చేయిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. మరోపక్క నాని సుజిత్ తో చేయబోయే ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని ఈ జూన్ నుండి మొదలు పెట్టాలి. కానీ ఆయన ఈ ఏడాది మొత్తం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కోసమే సమయాన్ని కేటాయించేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఇదే నిజమైతే ఈ ఏడాది లో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ మొదలు అవ్వడం అసాధ్యం. సుజిత్ కి కూడా నాని ఒక సమాచారం ఇవ్వడం తో , ఇప్పుడు ఆయన ‘ఓజీ 2’ పై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

చాలా రోజుల నుండి సుజిత్ కి సంబంధించిన రైటింగ్ డిపార్ట్మెంట్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ వర్క్ మీద పని చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమా షూటింగ్ కి డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. ఎందుకంటే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఆయన పూర్తి స్థాయిలో జనాల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, అప్పటి లోపు షూటింగ్ ని పూర్తి చెయ్యాలని చూస్తున్నాడట. అదే కనుక నిజమైతే ‘బ్లడీ రోమియో’ పరిస్థితి ఏంటి?, వచ్చే ఏడాది చివరి వరకు నాని ఖాళీగా ఉండాల్సిందేనా..?, ఒక భారీ చిత్రం చేస్తున్నప్పుడు సరైన ప్లానింగ్ లేకపోతే ఎన్ని ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తుందో చెప్పడానికి ‘ది ప్యారడైజ్’ చిత్రం ఒక ఉదాహరణగా నిల్చింది.

Exit mobile version