
కరోనా కల్లోలం దేశంలో మరోసారి చోటుచేసుకుంది. వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన వేళ మిగతా సినిమాలు ఊపుగా సిద్ధమైన తరుణంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో మరోసారి దేశంలో ఆంక్షలకు రెడీ అయ్యింది. మహారాష్ట్రలో అయితే లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇక టాలీవుడ్ పై కూడా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే లవ్ స్టోరీ, ఆచార్య సహా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఆ జాబితాలోకి నాని ‘టక్ జగదీష్’ కూడా చేరింది.
నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టక్ జగదీష్’ ట్రైలర్ రేపు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సినిమాను ఈనెల 23వ తేదీని రిలీజ్ చేస్తున్నట్టు ఇదివరకు ప్రకటించారు. ఇప్పుడు దురదృష్టవశాత్తూ ఈ సినిమా ట్రైలర్ తోపాటు చిత్రం విడుదల కూడా వాయిదా పడింది. దీంతో నాని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
కరోనా పరిస్థితులు, ప్రభుత్వాలు ఆంక్షలకు రెడీ అవుతున్న కారణంగానే ‘టక్ జగదీష్’ను ఏప్రిల్ 23న విడుదల చేయలేమని వీడియో ద్వారా నాని ప్రకటించారు. ట్రైలర్, మూవీ విడుదలకు మరో తేదీలని ప్రకటిస్తామని నాని తెలిపారు.
టాలీవుడ్ సమాచారం ప్రకారం.. టక్ జగదీష్ రీరికార్డింగ్ చివరిదశలో ఉంది. ఔట్ పుట్ బాగా వచ్చినట్టు సమాచారం. ఈ కుటుంబ కథా చిత్రాన్ని ఈ కరోనా వేళ జనాలు రాని సమయంలో విడుదల చేయవద్దని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత విడుదల చేయాలని నాని అండ్ డీ నిర్ణయించింది.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితూ వర్మ హీరోయిన్ గా నటించింది.