Homeఎంటర్టైన్మెంట్Nani The Paradise Movie Hard Work: ప్యారడైజ్ కోసం నాని అంతలా కష్టపడ్డాడా..?

Nani The Paradise Movie Hard Work: ప్యారడైజ్ కోసం నాని అంతలా కష్టపడ్డాడా..?

Nani The Paradise Movie Hard Work: సినిమా ఇండస్ట్రీలో రాణించడమనేది అంతా ఆషామాషీ వ్యవహారైతే కాదు. బయటి నుంచి చూసే జనాలకు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు చాలా ఈజీగా డబ్బులను సంపాదిస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళు పడే కష్టం ఎవరికి కనిపించదు. నిజానికి ఇక్కడ సక్సెస్ సాధించిన వాళ్ళకి మాత్రమే గొప్ప గుర్తింపైతే వస్తుంది. సక్సెస్ లేని వారిని ఎవరు పట్టించుకోరు… వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చి మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన నాని ఆ తర్వాత హీరోగా మారి తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి… అతను తన రూటు మొత్తాన్ని చేంజ్ చేసి మాస్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. గతంలో ‘దసర’ సినిమాతో మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ‘ప్యారడైజ్’ సినిమాతో మరోసారి మాస్ జపం చేస్తున్నాడు…ఈ సినిమాలో బూతు పదాలను కూడా ఎక్కువగా వాడుతూ సినిమాకి హై తీసుకొచ్చే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఎప్పుడైతే గ్లింప్స్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం నాని ఇంతకుముందు ఎన్నడు పడని విధంగా కష్టపడుతున్నాడట. ఇంతకుముందు నాని సినిమాలు కంఫర్ట్ జోన్ లో ఉండేవి.

కానీ ప్రస్తుతం ఆయన ప్రయోగాత్మకమైన సినిమాల వైపు మొగ్గు చూపేవాడు కాదు. కానీ ఈ సినిమాతో ప్రయోగాత్మకమైన సినిమాలను కూడా నాని చేయగలడు అని నిరూపించుకుంటున్నాడు. పొద్దున నాలుగు గంటలకి లేచి మూడు గంటల పాటు జిమ్ములోనే తను వర్కౌట్స్ అయితే చేస్తున్నాడట. ఇంతకుముందు పెద్దగా జిమ్ కి వెళ్లే అలవాటు లేని నాని ఈ సినిమాతో జిమ్ లో కుస్తీ పడుతున్నాడట.

ఇక డాన్స్ విషయంలో కూడా ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట… అలాగే ఈ సినిమా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి ఎప్పుడూ అదే ట్రాన్స్ లో ఉంటున్నాడట. అందువల్లే అతను ప్యారడైజ్ అయిపోయే వరకు మరో సినిమా అయితే చేయకుండా ఈ ఒక్క సినిమా మీదనే ఫుల్ ఫోకస్ పెట్టాడు.

నిజానికి ఈ సినిమా సక్సెస్ అయితే నాని పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. అందువల్లే ఆయన ఈ సినిమా మీదనే ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అవ్వడమే కాకుండా ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular