Dasara Movie Closing Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దసరా’ ఈ సమ్మర్ కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఊర మాస్ గా ఉండడం వల్ల టాక్ బాగున్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపుకి రాలేదు. ఫలితంగా 100 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే సత్తా ఉన్న సినిమా, కేవలం 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ తో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక నాని ఈ సినిమా ఇతర బాషలలో ‘కాంతారా’ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం తో ఉండేవాడు, కానీ ఈ సినిమా ఇతర బాషలలో కనీస స్థాయి వసూళ్లు కూడా రాకపోవడం విశేషం. అందుకే అనుకున్న టార్గెట్ కి చేరుకోలేకపోయిన, కమర్షియల్ గా మాత్రం ఈ చిత్రం నాని కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది.
ఇక ఈ చిత్రం ఏ ప్రాంతం లో ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.ఈ చిత్రం విడుదలైన అన్నీ ప్రాంతాలలో నైజాం ప్రాంతం లో మాత్రం స్టార్ హీరో రేంజ్ క్లోసింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇక్కడ 26 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.
ఆ తర్వాత సీడెడ్ లో 5 కోట్ల 30 లక్షల రూపాయిలు,ఉత్తరాంధ్ర లో 4 కోట్ల 50 లక్షల రూపాయిలు, ఉభయ గోదావరి జిల్లాలు రెండు కలిపి 3 కోట్ల 50 లక్షల రూపాయిలు,గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 50 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో రెండు కోట్ల 15 లక్షల రూపాయిలు,నెల్లూరు లో 95 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా 45 కోట్ల రూపాయిలు , అలాగే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి 64 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.