Homeఎంటర్టైన్మెంట్Nani birthday: నాని బర్త్ డే స్పెషల్ : బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎలా...

Nani birthday: నాని బర్త్ డే స్పెషల్ : బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎలా వచ్చాడంటే!

Nani birthday
Nani birthday

Nani birthday: నాచురల్ స్టార్ నాని బర్త్ డే నేడు. 1984 ఫిబ్రవరి 24న కృష్ణాజిల్లాలో జన్మించిన నాని 38వ ఏట అడుగుపెట్టాడు. ఆయన బర్త్ డే వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాని అభిమానులు స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి సినిమా నేపథ్యంలో లేకుండా నాని స్టార్ గా ఎదిగాడు. తనకంటూ ఒక స్టైల్, ఇమేజ్, ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు.

నాని బాల్యం విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే జరిగాయి. ఈ క్రమంలో సినిమా మీదకు మనసు మళ్లింది. చదువు పూర్తి కాగానే అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ గా చేరారు. ఆయన తెరకెక్కించిన రాధాగోపాళం చిత్రానికి పనిచేశారు. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అయితే హీరో కావాలని కొందరు ఆయన్ని ప్రోత్సహించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి అష్టా చెమ్మా మూవీలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన అష్టాచెమ్మా మంచి విజయం సాధించింది. స్నేహితుడు మూవీతో మరో హిట్ కొట్టాడు. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన అలా మొదలైంది నానికి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. అత్యంత సహజంగా ఉండే నాని నటన ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. పిల్లజమీందార్, ఈగ ఇలా వరుస హిట్స్ పడ్డాయి . దర్శకుడు రాజమౌళి ఛాన్స్ ఇవ్వడం నిజంగా గొప్ప పరిణామం. ఆయన ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈగ నానికి ఎక్కడలేని ఫేమ్ తెచ్చింది. పాత్ర నిడివి తక్కువే అయినా… అద్భుతమైన లవ్ ట్రాక్ తో ఆకట్టుకున్నాడు.

Nani birthday
Nani birthday

ఈగ తర్వాత నాని వరుసగా ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. ఒక దశలో కెరీర్ ముగుస్తుందేమో అనుకున్నారు. అయితే ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ కొట్టింది. అనంతరం తనకు ఫస్ట్ మూవీలో ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి జెంటిల్ మెన్ తో మరో హిట్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళుతున్నాడు.

నాని లేటెస్ట్ మూవీ దసరా విడుదలకు సిద్ధమైంది. మార్చి 30న దసరా విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. నాని ఊరమాస్ డీగ్లామర్ రోల్ చేయడం విశేషం. నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా దసరా విడుదలవుతుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version