https://oktelugu.com/

Nani And Vijaya Devarakonda: ఆ రెండు చోట్ల తమ హవా సాగిస్తున్న నాని ..విజయ దేవరకొండ.. స్టార్ హీరోల కన్నా ఎక్కువగా…

ఇక ఈ మధ్య దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నాని. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఒక రెండు ఏరియాలలో స్టార్ హీరోల సినిమాకు సైతం రానంత వచ్చాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో దసరా సినిమా మొదటి రోజు 9.5 కోట్లు సంపాదించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 2, 2023 / 01:00 PM IST

    Nani And Vijaya Devarakonda

    Follow us on

    Nani And Vijaya Devarakonda: టైర్ 2 హీరోల్లో తమ స్వయంకృషితో వచ్చి ఎక్కువ సక్సెస్ సాధించిన హీరోలు ఎవరు అంటే ముందుగా వినిపించే పేర్లు నాని, విజయ్ దేవరకొండ.

    ముఖ్యంగా సినిమాకి క్లాప్స్ కొట్టే దగ్గరనుంచి ప్రస్తుతం నేచురల్ స్టార్ గా ఎదిగాడు మన నాని. ఆయన డౌన్ టు ఎర్త్ స్వభావం.. అలానే స్క్రీన్ పై మెస్మరైజ్ చేసే యాక్టింగ్.. ఎంతోమంది అభిమానులను తీసుకొచ్చి పెట్టింది.

    ఇక ఈ మధ్య దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నాని. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఒక రెండు ఏరియాలలో స్టార్ హీరోల సినిమాకు సైతం రానంత వచ్చాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో దసరా సినిమా మొదటి రోజు 9.5 కోట్లు సంపాదించింది. ఇక నైజాంలో ఏకంగా 10 కోట్లు సంపాదించింది. ఈ కలెక్షన్స్ చూస్తే.. ఒక స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాకి వచ్చే రేంజ్ ని నాని అవలీలగా అందుకునేసారని అర్థమవుతోంది.

    ఇక మరో పక్క చిన్న సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ల నుంచి అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ వరకు ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ.

    ఆయన డిఫరెంట్ యాటిట్యూడ్ ప్రస్తుతం యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోయింది.‌ కాగా గీతాగోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమైన ఈ హీరో ఇప్పుడు ఖుషి సినిమాతో మళ్లీ కలెక్షన్స్ వర్షం కురిపించారు. ఈ సినిమా ఓవర్సీస్ లో మొదటి రోజు 8.5 కోట్లు కలెక్షన్స్ అందుకోగా.. నైజాంలో 8 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక మొత్తానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రెండు సినిమాలకు కూడా మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కానీ తమ రేంజ్ చూపించారు ఈ ఇద్దరు హీరోలు.

    మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు తమ లేటెస్ట్ సినిమాలతో నైజాంలో ఓవర్సీస్ లో తాము స్టార్ హీరోస్ తో సమానంగా గా పోటీ పడగలమని రుజువు చేసుకున్నారు.