Akhanda- IFFI Goa: గత కొంతకాలం నుండి నందమూరి అభిమానులకు గోల్డెన్ శకం నడుస్తుంది అనే చెప్పాలి..డిసెంబర్ నెలలో లాక్ డౌన్ తర్వాత విడుదలైన బాలయ్య బాబు ‘అఖండ’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..కరోనా తో కాలం గడిపిన జనాలు ఇప్పుడప్పుడే థియేటర్స్ కి వస్తారా అనే సందేహం లో ఉన్న సమయంలో విడుదలైన ఈ చిత్రం, అందరి సందేహాలను పటాపంచలు చేసి, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే సుమారు 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపోయేలా చేసింది..ఒక స్టార్ హీరో కి ఎలాంటి వసూళ్లు అయితే వస్తాయో అలాంటి వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం..ఇక ఆ తర్వాత వచ్చిన నందమూరి సినిమాలు #RRR మరియు భింబిసారా ఎలాంటి సంచలన విజయాలు సాధించాయి మన అందరికి తెలిసిందే..అయితే ఇప్పుడు నందమూరి సినిమాలకు మరో అరుదైన గౌరవం దక్కనుంది.

ఇక అసలు విషయానికి వస్తే గోవా లో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఫిలిం ఫెస్టివల్ జరగనుంది..53 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పేరుతో జరగనున్న ఈ ఈవెంట్ లో తెలుగు సినిమాల హవానే ఎక్కువ కనిపిస్తుంది..నవంబర్ 20 వ తారీకు నుండి 28 వ తారీకు వరుకు కొనసాగే ఈ ఫిలిం ఫెస్టివల్ లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ సెక్షన్ లో బాలయ్య బాబు నటించిన ‘అఖండ’ మరియు ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా నటించిన #RRR సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి.

వీటితో పాటుగా ఫీచర్ ఫిలిం క్యాటగిరి లో ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన ‘సినిమా బండి’, విద్య సాగర్ తెరకెక్కించిన ‘కుదిరం బోస్’ వంటి సినిమాలతో పాటుగా అడవి శేష్ హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మేజర్’ కూడా ప్రదర్శితమవుతోంది..అయితే నందమూరి సినిమాలు ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందడం..అది కూడా బాలయ్య సినిమా మెయిన్ స్ట్రీమ్ క్యాటగిరి లో ఇంటెర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమవడం, నిజంగా నందమూరి అభిమానులకు గర్వకారణం అనే చెప్పాలి.