Balakrishna: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం నేడు ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదల కానుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ షోస్ కి , టికెట్ రేట్స్ పెంపు కి అనుమతి వచ్చేసింది. కానీ తెలంగాణ లో ఇప్పటి వరకు అనుమతి రాలేదు. మధ్యాహ్నం లోపు అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే విజయవాడ, గుంటూరు జిల్లాల్లో తప్ప ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగకపోవడం గమనార్హం. అఖండ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వయస్సు ఉన్నవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేశారు. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి. ఇలా అన్నీ మాధ్యమాల ద్వారా అద్భుతమైన రీచ్ ని సాధించిన సినిమా అది. అలాంటి సినిమా సీక్వెల్ కి ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
Also Read: కాంతారా’ హీరో రిషబ్ శెట్టి కి క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్..దెబ్బకు దిగొచ్చాడుగా!
ఇదంతా పక్కన పెడితే మరోపక్క బాలయ్య ఈ సినిమా ప్రొమోషన్స్ బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. హిందీ వెర్షన్ లో ఎదో మొక్కుబడిగా విడుదల చేసాము అనే విధంగా కాకుండా, అక్కడి ఆడియన్స్ కి బలంగా చేరేలా ప్రొమోషన్స్ చేస్తున్నారు మూవీ టీం. కేవలం హిందీ ప్రొమోషన్స్ కోసం మూడు కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేశారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ కూడా చాలా డల్ గా ఉన్నాయి. ప్రీమియర్ షోస్ నుండి మంచి పాజిటివ్ టాక్ వస్తే, మార్నింగ్ షోస్ నుండి హిందీ పికప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రొమోషన్స్ లో భాగంగా బాలయ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. మెగా ఫ్యాన్స్ అయితే బాలయ్య ని ఒక రేంజ్ వెక్కిరిస్తున్నారు.
ముందుగా యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు మొట్టమొదటిసారి జై బాలయ్య అనే నినాదం ఎప్పుడు విన్నారు’ అని అడగ్గా, దానికి బాలయ్య సమాధానం చెప్తూ ‘అర్జునుడు సుభద్ర కి పద్మవ్యూహం గురించి వివరిస్తున్నప్పుడు, ఆమె కడుపులో ఉన్న అభిమన్యుడు ఎలా అయితే విన్నాడో, అదే విధంగా చిన్నప్పుడు నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే జై బాలయ్య స్లోగన్స్ విన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే బాలయ్య తనని తానూ కారణజన్ముడిగా ఊహించుకున్నాడు అన్నమాట. దీనిపై ఎన్ని యాంగిల్స్ లో ట్రోల్స్ పడాలో అన్ని యాంగిల్స్ లో ట్రోల్స్ పడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ ఓవర్సీస్ లో తెలుగు రాష్ట్రాల కంటే కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.