Balakrishna: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(Upasana Konidela) దంపతులు రీసెంట్ గానే కవలపిల్లలకు జన్మనిచ్చిన ఘటన సోషల్ మీడియా లో ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానులు ఇప్పటికీ సెలబ్రేషన్ మోడ్ నుండి బయటకు రాలేదు. ఇక మెగా ఫ్యామిలీ లో ఆనందం ఏ స్థాయిలో ఉండుంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. చిరంజీవి కి వారసుడు కావాలనే కోరిక మనసులో చాలా గట్టిగా ఉండేది. ఆ కోరిక తీరిపోయింది. ఏడాది ప్రారంభం లో మొదటి నెలలోనే ఆయన హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలబడడం, నెల చివర్లో మరోసారి తాత అవ్వడం, ఈ వయస్సులో ఇంతకు మించి మెగాస్టార్ చిరంజీవి కి ఆనందం ఏముంటుంది చెప్పండి. సినీ సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలపిల్లలు పుట్టడం పై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ఇది ఇలా ఉండగా బాలకృష్ణ(Nandamuri Balakrishna) కి చిరంజీవి(Megastar Chiranjeevi) కి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా కూడా కోల్డ్ వార్డ్ నడుస్తూనే ఉంటుంది. గత ఏడాది అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చిరంజీవి ని అవమానించడం, అందుకు చిరంజీవి కూడా కౌంటర్లు ఇవ్వడం వంటివి పెద్ద హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో మళ్లీ వీళ్లిద్దరు మాట్లాడుకోలేనంత గ్యాప్ ఏర్పడిపోయింది అని అంతా అనుకున్నారు. చిరంజీవి తో బాలయ్య రిలేషన్ ఎలా ఉన్నా, బాలయ్య కి ఆయన తనయుడు రామ్ చరణ్ తో మాత్రం మంచి సాన్నిహిత్యం ఉంది. కలిసినప్పుడల్లా బాలయ్య పట్ల రామ్ చరణ్ చూపించే గౌరవం, అదే సమయం లో బాలయ్య రామ్ చరణ్ పట్ల చూపించే ప్రేమ, మెగా మరియు నందమూరి అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. వీళ్ళ రిలేషన్ కి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో తిరుగుతూనే ఉంటాయి.
ఇది కాసేపు పక్కన పెడితే రామ్ చరణ్ కి కవలలు పుట్టిన సందర్భంగా బాలయ్య శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామ్ చరణ్ కి ప్రత్యేకమైన ఫ్లవర్ బొకే తో పాటు, వెంకటేశ్వర స్వామి పటం ని కూడా బహుమతి గా పంపినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. ఇది నిజంగా అభిమానులు ఊహించనిది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్, బాలయ్య కి తమ అభిమాన హీరో పట్ల ఉన్న ప్రేమపై కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు. మరో పక్క అదే నందమూరి ఫ్యామిలీ కి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అయితే అందరికంటే ముందుగా రామ్ చరణ్ కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు.